Asianet News TeluguAsianet News Telugu

Telangana Election Results 2023: ఒకే కుటుంబం నుంచి గెలిచిన వాళ్లు వీరే.. ఫ్యామిలీ పాలిటిక్స్ మామూలుగా లేవుగా

తెలంగాణలో ఫ్యామిలీ పాలిటిక్స్ మామూలుగా లేవు. రాజకీయ కుటుంబాలు పోటీలో దిగి సక్సెస్ అయ్యారు. ఈ కుటుంబాల గురించి ఆసక్తికరమైన విషయాలు చర్చిద్దాం.
 

telangana election results 2023 family candidates kalvakuntla, mynampalli family, komati reddy, gaddam brothers kms
Author
First Published Dec 3, 2023, 5:25 PM IST

హైదరాబాద్: తెలంగాణలో ఫ్యామిలీ పాలిటిక్స్ మామూలుగా లేవు. పలు రాజకీయ కుటుంబాలు తమ సత్తా చాటాయి. చాలా వరకు ఈ కుటుంబాలు సక్సెస్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.


ఆ ముగ్గురూ..

అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబం ఎప్పటిలాగే ఈ సారి కూడా ఘన విజయాలను నమోదు చేసుకుంది. సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావులు గెలిచారు. గజ్వేల్ నుంచి కేసీఆర్, సిరిసిల్ల నుంచి కేటీఆర్, సిద్దిపేట నుంచి హరీశ్ రావులు ఘన విజయం సాధించారు.

దంపతులు:

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఇద్దరూ బరిలో దిగారు. వీరిద్దరూ గెలుపొందారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్, కోదాడ నుంచి పద్మావతి గెలిచారు.

సోదరులు:

నల్గొండలో కోమటిరెడ్డి సోదరులు మంచి మెజార్టీతో గెలుపొందారు. నల్గొండ నుంచి వెంకట్ రెడ్డి, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గెలిచారు.

Also Read: Election Results: ముగ్గురు బీజేపీ ఎంపీల ఓటమి.. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల గెలుపు

గడ్డం బ్రదర్స్:

గడ్డం వివేక్, వినోద్ సోదరులు ఇద్దరూ ఈ ఎన్నికల్లో గెలిచారు. చెన్నూర్ నుంచి వివేక్, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ గెలుపొందారు.

మామ, అల్లుడు:

మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. 

తండ్రీ కొడుకు:

బీఆర్ఎస్‌లో ఇద్దరికీ టికెట్లు అందక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మైనంపల్లి హన్మంతరావు.. మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కొడుకు రోహిత్ మాత్రం మెదక్‌లో విజయాన్ని సాధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios