Telangana Election results 2023: పార్టీ ఫిరాయించిన 11 మంది ఎమ్మెల్యేలు ఓటమి

గత ఎన్నికల్లో పార్టీ మారి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారు ఓటమి పాలయ్యారు.  కాంగ్రెస్ ను వీడిన అభ్యర్థులపై  ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. 

Telangana Election results 2023:12 MLAs who defected from the party were defeated lns

హైదరాబాద్:2018 ఎన్నికల్లో  కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులుగా విజయం సాధించిన 14 మంది  ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఈ దఫా బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా  ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  21 ఎమ్మెల్యేలు విజయం సాధించారు.  అయితే  వీరిలో  12 మంది  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడారు. 

సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, హరిప్రియా నాయక్,  గండ్ర వెంకటరమణ రెడ్డి,వనమా వెంకటేశ్వరరావు,రేగా కాంతారావు, జాజుల సురేందర్ రెడ్డి,బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు,బీరం హర్షవర్ధన్ రెడ్డి,కందాల ఉపేందర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలో చేరారు.  అయితే  ఈ ఎన్నికల్లో  ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వలేదు. మిగిలిన అందరికీ భారత రాష్ట్ర సమితి టిక్కెట్లను కేటాయించింది. 

also read:Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  ఆశ్వరావుపేట, సత్తుపల్లి నుండి  టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.  ఆశ్వరావు పేట నుండి మెచ్చా నాగేశ్వరరావు,  సత్తుపల్లి నుండి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు.  ఈ ఇద్దరు కూడ టీడీపీని వీడి  భారత రాష్ట్ర సమితిలో చేరారు.వీరిద్దరిని కూడ  ఓడించారు. 

also read:ఎవరీ జాయింట్ కిల్లర్ వెంకటరమణ రెడ్డి: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ ను ఓడించిన కాటిపల్లి

మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుండి సబితా ఇంద్రారెడ్డి,  ఎల్ బీ నగర్ నుండి  దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలు బీఆర్ఎస్ అభ్యర్థులుగా విజయం సాధించారు. మిగిలిన అన్ని స్థానాల్లో  కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.  పార్టీ ఫిరాయించిన నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది.  ఈ నియోజకవర్గాల్లో పెద్ద విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన  12 మంది ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది  ఓటమి పాలయ్యారు.ఒక్కరికి టిక్కెట్టు కేటాయించలేదు.  టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన ఇద్దరు కూడ ఓటమి పాలయ్యారు. దీంతో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు  ఓటమి చెందారు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios