Telangana Election Result: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మొదలుపెట్టే టైమ్ ఇదే..!
ఈ రోజు పోలింగ్ ఉదయం 7గంటలకు మొదలైంది. సాయంత్రం 5గంటలకు వరకు జరుగుతుంది. కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 3గంటల వరకు మాత్రమే పోలీంగ్ జరుగుతంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ చాలా చురుకుగా జరుగుతోంది. మొత్తం 119 నియోజకవర్గాలకు ఈ పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికలు జరిగిన మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ , మిజోరాం వంటి నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే సుదీర్ఘమైన ఎన్నికల సీజన్‌ను చూసిన తర్వాత నవంబర్ 30 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం హై-ఆక్టేన్ ప్రచారం మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో పత్రికల్లో తమ విజయాల గురించి ప్రకటనల ప్రచురణను నిలిపివేయాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల నియమావళి ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోనందుకు ఎన్నికల సంఘం వివరణ కూడా కోరింది.
ఇదిలా ఉండగా, ఈ రోజు పోలింగ్ ఉదయం 7గంటలకు మొదలైంది. సాయంత్రం 5గంటలకు వరకు జరుగుతుంది. కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 3గంటల వరకు మాత్రమే పోలీంగ్ జరుగుతంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ విజయంపై ధీమాతో ఉన్నాయి. నేడు పోలింగ్ ముగియగానే, డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. డిసెంబర్ 3వ తేదీన ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అదేరోజు సాయంత్రం ఫలితం వెలువడుతుంది.
ఇదిలా ఉండగా, ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ రోజే విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి చాలా సంస్థలు రెడీగా ఉన్నాయి. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్పులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవాళ వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ ముగిసిన అరగంట తరువాత అంటే సాయంత్రం 5.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ప్రకటించింది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సాయంత్రం 6.30 గంటల తరువాతే విడుదల చేయాలని గతంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పుడీ సమయంలో మార్పు చేసింది. కాబట్టి, ఈ రోజు సాయంత్రం 5గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. వాటి ద్వారా ఎగురు గెలుస్తారు అనే ఒక ఐడియా అయితే రానుంది. మరి, ఈసారి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి విజయ ఢంకా మోగిస్తారో లేక, చాలా కాలంగా విజయం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ మళ్లీ లీడ్ లోకి వస్తుందేమో చూడాలి.