kalvakuntla Chandrashekar Rao...గోస పెట్టారు:వరంగల్ లో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రతి రోజూ మూడు, నాలుగు సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఇవాళ వరంగల్ ఈస్ట్, వెస్ట్ తో పాటు గజ్వేల్ నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
వరంగల్:తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ( కేసీఆర్) చెప్పారు. మంగళవారంనాడు వరంగల్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.
వరంగల్ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. భద్రకాళి మాత ఆశీర్వాదంతో తెలంగాణ సాధించుకున్నామని ఆయన చెప్పారు.ప్రచారంలో తనకు ఇది 95వ సభగా ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇంకా పూర్తి పరిణతి రాలేదన్నారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీయే కదా అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.కాంగ్రెస్ పాలనలో పెన్షన్ రూ. 200 ఇచ్చేవారన్నారు.ఎన్నికల తర్వాత పెన్షన్ రూ. 5 వేలకు చేరుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
also read:Telangana Assembly Elections 2023:ఓటేశాక చూపుడు వేలికి సిరా, హైద్రాబాద్‌లోనే తయారీ
1969లో తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని పిట్టలను కాల్చినట్టుగా కాల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే కదా అని ఆయన చెప్పారు.ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టారని ఆయన ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్,50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని కేసీఆర్ కోరారు.అజంజాహి మిల్లును ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన విమర్శించారు.కాకతీయ టెక్స్ టైల్స్ పార్కులో లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని కేసీఆర్ చెప్పారు.
also read:Telangana Assembly elections 2023: వీవీప్యాట్,ఈవీఎంలలో తప్పుడుగా ఓటు రికార్డైతే ఏం చేయాలి?
విద్య, వైద్య రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.పదేళ్లలో విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేసినట్టుగా కేసీఆర్ చెప్పారు.ట్రాఫిక్ కట్టడి కోసం ఆరు బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని కేసీఆర్ వివరించారు.వరంగల్ ను అద్భుత నగరంగా చూడాలన్నదే తన కోరిక అని కేసీఆర్ చెప్పారు. గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదన్నారు.రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో అతిపెద్ద బహిరంగ సభ వరంగల్ లో నిర్వహించామన్నారు.తెలంగాణ సాధన కోసమే బీఆర్ఎస్ పుట్టిందని కేసీఆర్ చెప్పారు.