ఆంధ్రాలో రోడ్లు ఎలా ఉన్నాయి:ఆశ్వరావుపేట సభలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్  విస్తృతంగా  పర్యటిస్తున్నారు.  రాష్ట్రంలో ప్రతి రోజూ మూడు ఎన్నికల సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు.

 Telangana CM KCR interesting comments on  Andhra pradesh roads in Dammapeta BRS Election meeting lns


ఖమ్మం: పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయి, తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఆశ్వరావుపేట ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్న విషయాన్ని ఆయన   ప్రస్తావించారు. 

తెలంగాణలో  మూడో దఫా  బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకు వస్తే  వ్యవసాయానికి  24 గంటల పాటు ఉచిత విద్యుత్ ను కొనసాగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

సోమవారంనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  ఆశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని దమ్మపేటలో  నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో  తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అబివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగాలంటే  బీఆర్ఎస్ సర్కార్ మూడోసారి  కూడ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  రాష్ట్రంలో జరిగిన అభివృద్ది గురించి కేసీఆర్  వివరించారు.

మన దేశంలో ప్రజాస్వామ్య పరిణతి పూర్తిస్థాయిలో రాలేదన్నారు.ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పచ్చి అబద్దాలు చెబుతున్నాయని ఆయన చెప్పారు.అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని  కేసీఆర్  పరోక్షంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కళ్లముందు జరిగిన అభివృద్దిని గమనించి ఓటు వేయాలని ఆయన కోరారు.
సమైక్య పాలకుల వైఖరి వల్ల కొన్ని దశాబ్దాల పాటు వెనుకబడిపోయామన్నారు. 

ఉచిత విద్యుత్ మూడు గంటల సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ చెబుతుందన్నారు.  ఉచిత విద్యుత్ మూడు గంటలు సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ధరణి పోర్టల్ ను కూడ ఎత్తివేస్తామని కాంగ్రెస్ నేతలు  చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. ధరణి పోర్టల్ ఎత్తివేస్తే  రైతు భీమా ఎలా వస్తుందని ఆయన  ప్రశ్నించారు.ధరణి పోర్టల్ వల్లే రైతు బంధు, రైతు భీమా సాధ్యమౌతుందని ఆయన  చెప్పారు. రైతు బంధు కావాలా వద్దో  చెప్పాలని ఆయన  ప్రశ్నించారు.  సీతారామ ప్రాజెక్టు ఇప్పటికే  70 శాతం పూర్తైందన్నారు.ఉద్యమాలను అణచివేసిన చరిత్ర  కాంగ్రెస్ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు.

సీతారామ ప్రాజెక్టు పూర్తైతే  మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.రైతుకు పెట్టుబడి స్థిరీకరించాలనే ఉద్దేశ్యంతో రైతు బంధును తీసుకు వచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. రైతులను ఆదుకోవాలనే ఆలోచన ఏ ప్రభుత్వం కూడ చేయలేదన్నారు. రైతు చనిపోతే రైతు భీమాను వారం రోజుల్లోనే అందిస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. 

 

రైతుబంధు ద్వారా ప్రజల సొమ్ము వృధా చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్నారు. రైతుబంధుతో  డబ్బులు వృధా చేస్తున్నామా అని ఆయన  ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios