తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023: కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు

ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు.వ్యూహాత్మకంగానే ఈ రెండు స్థానాల్లో కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేశారని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రెండు స్థానాల్లో  కేసీఆర్ పోటీపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.

Telangana CM KCR Files Nomination from Kamareddy Assembly Segment lns

కామారెడ్డి: తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారంనాడు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి  నామినేషన్ దాఖలు చేశారు.ఇవాళ ఉదయం గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి కూడ  ఆయన  నామినేషన్ దాఖలు చేశారు.  గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో నామినేషన్ దాఖలు చేసిన  తర్వాత హెలికాప్టర్ లో కేసీఆర్  కామారెడ్డికి చేరుకున్నారు. కామారెడ్డి రిటర్నింగ్ కార్యాలయంలో  కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు.

కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కేసీఆర్ పూర్వీకులు  నివాసం ఉన్నారు. దీంతో  కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.  కామారెడ్డి నుండి పోటీ చేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే  గంప గోవర్ధన్ కూడ  కేసీఆర్ ను కోరారు. 

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి గత ఎన్నికల్లో  కవిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో  వ్యూహత్మకంగానే  కేసీఆర్ ఈ దఫా ఎన్నికల్లో కామారెడ్డి నుండి బరిలోకి దిగినట్టుగా కూడ ప్రచారం లేకపోలేదు.2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుండి కేసీఆర్  బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.  ఈ దఫా గజ్వేల్ తో పాటు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి  కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు.


గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా  ఈటల రాజేందర్,  కామారెడ్డి నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  రేవంత్ రెడ్డి కేసీఆర్ పై బరిలోకి దిగుతున్నారు.  ఈ రెండు నియోజకవర్గాల్లో  కేసీఆర్ ను ఓడించాలని ఈ రెండు పార్టీల నేతలు  వ్యూహత్మకంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి.  ఈటల రాజేందర్ గతంలో  బీఆర్ఎస్ లో ఉన్న విషయం తెలిసిందే.  

also read:హరీష్ రావు లేకుండానే: గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్

గజ్వేల్ నియోజకవర్గంతో కేసీఆర్ కు మంచి సంబంధాలున్నాయి. దీంతో  గజ్వేల్ నుండి ఈటల రాజేందర్ బరిలోకి దిగారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  మూడో దఫా అధికారాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది.  అయితే ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలను ప్రారంభించాయి.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios