Asianet News TeluguAsianet News Telugu

Telangana Congress manifesto: ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని ఓటర్లను ఆకర్షించుకొనేందుకు  కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల మేనిఫెస్టోలో పలు అంశాలను చేర్చింది. ఇప్పటికే  ఆరు గ్యారంటీ స్కీమ్ లను  కాంగ్రెస్  ప్రకటించింది.వీటికి తోడుగా  మేనిఫెస్టోలో  పలు అంశాలను చేర్చింది.

 Telangana Assembly elections  2023: Telangana Congress Releases Election manifesto lns
Author
First Published Nov 17, 2023, 2:16 PM IST | Last Updated Nov 17, 2023, 10:48 PM IST

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే  శుక్రవారంనాడు హైద్రాబాద్ గాంధీ భవన్ లో విడుదల చేశారు.

37 అంశాలను మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇప్పటికే  విడుదల చేసిన ఆరు గ్యారంటీలకు  అనుబంధంగా  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.అభయహస్తం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో అంశాలు

*దివ్యాంగుల పెన్షన్  రూ. 5,016కు పెంపుతో పాటు  ఉచితంగా ఆర్టీసీబస్సులో ప్రయాణం.
*తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ. 25 వేల పెన్షన్. *అమరవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. 
*తెలంగాణ ఉద్యమ కారులపై  కేసులను ఎత్తివేయడంతో పాటు  250 గజాల ఇళ్ల స్థలం కేటాయింపు
*రైతులకు  ఏక కాలంలో  రూ. 2 లక్షల పంట రుణమాఫీ
*ధరణి స్థానంలో భూమాత పోర్టల్ .గతంలో పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలకు భూ హక్కులు
*సర్పంచ్ ల ఖాతాల్లో పంచాయితీ అభివృద్ది నిధులు
*గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు
*మరణించిన  గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు  రూ. 5 లక్షలు
*బడ్జెట్‌లో విద్యారంగం వాటా 15 శాతానికి పెంపు
*ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు
*ఆరు నెలలోపు మెగా డిఎస్పీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ
*ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి మెరుగైన ఉచిత వైద్యం
*ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పెన్షన్ విధానం
*జూనియర్ న్యాయవాదులకు రూ. 5వేల గౌరవభృతి

also read:బీఆర్ఎస్‌ కోసం బీజేపీ పోటీలోనే లేకుండా పోయింది: కుత్బుల్లాపూర్ సభలో మల్లికార్జున ఖర్గే
*మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ. 2 లక్షలు
*ప్రతి ఆటో డ్రైవర్ కు ఏటా రూ. 12 వేల ఆర్ధిక సహాయం
*ఎస్సీ వర్గీకరణ తర్వాత కొత్తగా మూడు ఎస్సీ కార్పోరేషన్లు
*బీసీ కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు
*బీసీలసబ్ ప్లాన్,ఈబీసీల కొరకు ప్రత్యేక సంక్షేమబోర్డు
*సంచారజాతులకు  విద్య, ఉద్యోగ అవకాశాలతో ఐదు శాతం రిజర్వేషన్లు
*ఆడపిల్లల పెళ్లికి రూ. లక్షతో పాటు 10 గ్రాముల బంగారం
*పుట్టిన ప్రతి ఆడబిడ్డకు  ఆర్ధిక సహాయంతో కూడిన బంగారు తల్లి
*వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్
*వడ్డీలేని పంట రుణాలు రూ. 3 లక్షలు
*ప్రజాభిప్రాయసేకరణతోపాటు, హైకోర్టు తీర్పులకు అనుగుణంగా  ఫార్మాసిటీల రద్దు
*కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పై  సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ
*ప్రతి విద్యార్ధికి ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం
*బాసర ట్రిపుల్ ఐటీ తరహలో మరో నాలుగు ట్రిపుట్ ఐటీల ఏర్పాటు
*ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10లక్షలకు పెంపు. మెకాలి సర్జరీ కూడ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తాం
*ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను తక్షణమే అందిస్తాం
*సింగరేణి ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వబోమని తేల్చిచెప్పిన
* ప్రతిరోజూ సీఎం కార్యాలయంలో ప్రజా దర్బార్
*18 ఏళ్లు దాటితే ఎలక్ట్రిక్ స్కూటర్  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios