రాహుల్ తెలంగాణ టూర్ : ఈ నెల 17న వరంగల్ లో రోడ్‌షోలు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  తెలంగాణపై  ఫోకస్ పెట్టారు. సమయం దొరికితే  తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొంటున్నారు.

telangana assembly elections  2023:Rahul gandhi To visit Warangl on november 17 lns

వరంగల్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  ఈ నెల  17న  తెలంగాణలో పర్యటించనున్నారు.  ఉమ్మడి వరంగల్ జిల్లాలో  పలు  సభలు,  కార్నర్ మీటింగ్ లలో రాహుల్ గాంధీపాల్గొంటారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి, నర్సంపేట,  వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో  రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లలో రాహుల్ గాంధీ పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  రాహుల్ గాంధీ విస్తృతంగా  ప్రచారంలో పాల్గొంటున్నారు.  ఛత్తీస్ ఘడ్,  మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడ  రాహుల్ గాంధీ  ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న నేపథ్యంలో  వీలును చూసుకొని తెలంగాణకు మరో రోజును  కేటాయించారు. 

తెలంగాణ రాష్ట్రంలో  ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుండే  రాష్ట్రంలో రాహుల్ గాంధీ విస్తృతంగా  పర్యటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత బస్సు యాత్రలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లలలో  కూడ ఆయన పాల్గొన్నారు.  రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడ  తెలంగాణ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు.  

కొల్లాపూర్ ఎన్నికల సభలో  పాల్గొనాల్సి ఉన్నప్పటికీ  అనారోగ్య కారణాలతో ఆమె ఈ సభకు హాజరు కాలేదు. దీంతో  రాహుల్ గాంధీయే ఈ సభలో పాల్గొన్నారు.  ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడ రాహుల్ గాంధీ  పలు సభల్లో పాల్గొన్నారు.  తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడ సోనియా గాంధీ  పాల్గొనే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు  సోనియాతో ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుంది. 

also read:రేవంత్ సహా ఎవరూ మాట్లాడలేదు, సూర్యాపేటలో బరిలో ఉంటా: కాంగ్రెస్ రెబల్ పటేల్ రమేష్ రెడ్డి

తెలొంగాణలో  ఈ దఫా అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది.  కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో  ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.  మరోవైపు కర్ణాటకలో అనుసరించిన ఫార్మూలానే  తెలంగాణలో కూడ కాంగ్రెస్ అమలు చేస్తుంది. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడం కోసం అన్ని అస్త్రాలను  వినియోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ ఎన్నికల్లో టిక్కెట్టు దక్కని అసంతృప్తులు  రెబెల్స్ గా బరిలో దిగారు. అయితే  వీరిని బుజ్జగించేందుకు  కాంగ్రెస్ నాయకత్వం  రంగంలోకి దిగింది.

రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ నాలుగైదు సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు.  తాను పోటీ చేస్తున్న  కామారెడ్డి,  కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు  ఇతర నియోజకవర్గాలపై కూడ రేవంత్ రెడ్డి  ఫోకస్ పెట్టారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios