తెలంగాణ ఎన్నికల సిత్రాలు... ఇంత చిన్న తండాకు ఏకంగా ఇద్దరు ఎమ్మెల్యేలట..! 

అది ఓ చిన్న తండా... వెయ్యిలోపు జనాభా... అయితేనేం వారికి ఇద్దరు ఎమ్మెల్యేలు వున్నారు. ఈ విచిత్ర తండా డోర్నకల్ పరిధిలో వుంది. 

Telangana Assembly Elections 2023 ...  one village in two constituency limits AKP

వరంగల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఇలా గ్రామాలబాట పట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గాల అభ్యర్థులకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది.  డోర్నకల్ మున్సిపాలిటీ రెండు నియోజకవర్గాల సమ్మేళనంగా వుండటంతో ఎవరు తమ ఓటర్లో.. ఎవరు పక్క నియోజకవర్గ ఓటర్లో గుర్తించడం కష్టంగా మారింది. దీంతో ఓటర్ లిస్ట్ చేతబట్టుకుని ప్రచారం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులోని ఓ సిసి రోడ్డు రెండు నియోజకవర్గాలను విడదీస్తోంది. లచ్చాతండాలోకి వెళుతుండగా కుడివైపు ఇళ్లన్నీ డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. రోడ్డుకు ఎడమవైపు ఇళ్లన్నీ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెం పరిధిలోకి వస్తాయి. ఇది ఇల్లందు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇలా చిన్నాతండా రెండు నియోజకవర్గాల పరిధిలో వుండటం అభ్యర్థుల్లో కన్ఫ్యూజన్ సృష్టిస్తోంది. 

Read More  కేటీఆర్, హరీష్ స్కెచ్ మామూలుగా లేదుగా... ఏకంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కే గాలం

ఇలా ఒకే తండా రెండు నియోజకవర్గాల పరిధిలో వుండటంతో అక్కడి ప్రజలు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుటుంబసభ్యులు ఒకే తండాలో వుంటున్నా ఓట్లు మాత్రం వేరువేరు నియోజకవర్గాల్లో వేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలోనూ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ బూతులు లచ్చాతండాలో ఏర్పాటుచేయనున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios