Telangana CM : తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు? : రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పదవిని చాలామంది ఆశిస్తారు... గెలిచివచ్చిన ప్రతి ఒక్కరికీ అడిగే హక్కు వుంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు.
ఖమ్మం : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తెలీదు... కానీ అప్పుడే ముఖ్యమంత్రి పదవిపై చర్చ మొదలయ్యింది. అధికార బిఆర్ఎస్ మినహా ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరు గెలిచినా సీఎంను నిర్ణయించడం అంత ఈజీ కాదు. నాయకులకు వ్యక్తిగత ప్రజాస్వామ్యం ఎక్కువగా వుండే కాంగ్రెస్ లో అయితే ముఖ్యమంత్రి నిర్ణయించడం మరీ కష్టం. ఇప్పటికే కొందరు సీనియర్లు ముఖ్యమంత్రి పదవి తమదేనన్న ధీమాతో వున్నారు. ఈ క్రమంలో మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని... ఖమ్మంలో జిల్లాలో అయితే పదికి పది సీట్లు తమవేనని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పదవిని చాలామంది ఆశిస్తారు... గెలిచివచ్చిన ప్రతి ఒక్కరికీ అడిగే హక్కు కూడా వుంటుందన్నారు. కానీ రాష్ట్రాన్ని సమర్దవంతంగా పాలిస్తారన్న నమ్మకం అధిష్టానానికి ఎవరిపై అయితే వుంటుందో వారే సీఎం అవుతారన్నారు. రాష్ట్రంలో ఎంతపెద్ద నాయకులైనా అధిష్టానాన్ని మెప్పిస్తేసే ముఖ్యమంత్రి అవుతారని రేణుకా చౌదరి స్పష్టం చేసారు.
Read More కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ లు కాదు... కేసీఆర్ అతన్ని సీఎం చేసినా ఆశ్చర్యంలేదు...: బండి సంజయ్
కర్ణాటకలో ఎలాగయితే అందరి ఆమోదంతో ముఖ్యమంత్రి ఎంపిక జరిగిందో తెలంగాణలో కూడా అదే పద్దతి వుంటుందన్నారు. అందరూ డికె శివకుమార్ సీఎం అనుకున్నారు... కానీ సిద్దరామయ్య అయ్యారని... తెలంగాణలో కూడా ముందుగానే ఎవరు సీఎం అవుతారో చెప్పడం కష్టమన్నారు.