Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Elections 2023 : భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేద్దామా? సంజయ్ కు గంగుల రివర్స్ పంచ్ 

కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ అకృత్యాలు మరీ ఎక్కువయ్యాయని...  ఓటమి భయంతో విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంచుతున్నాడని బిఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ఆరోపించారు. 

Telangana Assembly Elections 2023 ... BRS Leader Gangula Kamalakar serious on BJP MP Bandi Sanjay AKP
Author
First Published Nov 29, 2023, 2:38 PM IST

కరీంనగర్ : ధర్మం, దేవుడి పేరుచెప్పి రాజకీయాలు చేసే బిజెపి నేత బండి సంజయ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధర్మంగా గెలవాలని చూస్తున్నాడని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. మళ్లీ ఎక్కడ తన చేతిలో ఓడిపోతానో అని భయపడి అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు.  ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి బీజేపీ వాళ్లు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని అన్నారు. డబ్బులు, మద్యం పంపిణీ చేయలేదని బండి సంజయ్  భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేస్తారా..? అని గంగుల సవా సవాల్ విసిరారు. 

కరీంనగర్ లో సంజయ్ అకృత్యాలు మరీ ఎక్కువయ్యాయని... అతడి తీరుతో ప్రజలు విసిగివేసారి పోయారని గంగుల అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనచేతితో చిత్తుగా ఓడిన సంజయ్ లోక్ సభ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గెలిచాడన్నారు. అతడిని నమ్మి కరీంనగర్ ప్రజలు పార్లమెంట్ కు పంపిస్తే ఏం చేసాడు? నిరాశే మిగిలిందని అన్నారు. ఎంపీగా సంజయ్ ఘోరంగా విఫలం అయ్యారు... అందుకే మూడోసారి ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు.  

దక్షిణ భారతదేశంలోని మొదటిసారిగా హ్యాట్రిక్ విజయం సాధించిన పార్టీగా బిఆర్ఎస్ నిలవనుందని... తెలంగాణలో మూడోసారి అధికారం తమదేనని గంగుల ధీమా వ్యక్తం చేసారు. తాను మంచి మెజార్టీతో నాలుగోసారి విజయం సాధించబోతున్నానని గంగుల పేర్కొన్నారు. 

Read More  Telangana Assembly Elections 2023 : ఓడితే కుటుంబంతో కలిసి సూసైడ్ ... పాడి కౌశిక్ వ్యాఖ్యలపై ఈసి సీరియస్

కొత్తపల్లిలో గత రాత్రి చోటుచేసుకున్న ఉద్రిక్తతకు బండి సంజయ్, బిజెపి నాయకులే కారణమన్నారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో వుండి సంజయ్ చాలా దారుణంగా వ్యవహరించారని అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ బిజెపి డబ్బులు పంచుతుంటే బిఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారని తెలిపారు. ఇలా డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన సంజయ్ తిరిగి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపైనే దౌర్జన్యానికి దిగాడని అన్నారు. సంజయ్ డబ్బులు పంచుతున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో కూడా రికార్డయ్యాయని గంగుల తెలిపారు.  

బిఆర్ఎస్ వాళ్లు డబ్బులు పంచుతుంటే పట్టుకున్నామని అంటున్న సంజయ్ వెంటనే పోలీసులకు ఎందుకు పిర్యాదు చేయలేదు? అని గంగుల ప్రశ్నించారు. ఇంట్లోకి చొరబడి మరీ బిఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తావా? అని నిలదీసారు. గూండాలను వెంటపెట్టుకుని తిరుగుతూ దాడులు చేయడమేనా దేశం కోసం... ధర్మం కోసం అంటూ గంగుల కమలాకర్ ఎద్దేవా చేసారు. 

బండి సంజయ్ బూటకపు మాటలను కరీంనగర్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని... మరోసారి ఆయన ఓటమి ఖాయమని గంగుల అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ అలజడులు సృష్టించే సంజయ్ ఎమ్మెల్యే అయితే కరీంనగర్ బ్రతకదని ప్రజలే అనుకుంటున్నారని తెలిపారు.  కాబట్టి సంజయ్ విజయవంతంగా పరాజయం చెందనున్నారని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios