Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బిఎస్పి చీఫ్ కారు యాక్సిడెంట్ ... ఆర్ఎస్ ప్రవీణ్ కు తప్పిన ప్రమాదం

బహుజన సమాజ్ వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 

Telanana BSP Chief RS Praveen Car Accident AKP
Author
First Published Nov 15, 2023, 6:45 AM IST

కాగజ్ నగర్ : తెలంగాణ బిఎస్పి పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. తాను పోటీచేస్తున్న సిర్పూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ప్రవీణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనకవైపు నుండి దూసుకువచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ప్రవీణ్ కారులోనే వున్నప్పటికి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... తెలంగాణలో చాలాకాలంపాటు ఐపిఎస్ గా సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇంకా చాలాకాలం సర్వీస్ వున్నప్పటికీ రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసారు. ప్రస్తుతం బహుజన సమాజ్ వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో బిఎస్పి బరిలోకి దిగింది. పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూరులో బరిలోకి దిగారు. ఇప్పటికే నామినేషన్ దాఖలుచేసిన ఆయన జోరుగా ప్రచారం చేపట్టారు. ఇలా నిన్న(మంగళవారం) నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. 

Read More  332 కిలో మీట‌ర్ల రీజినల్‌ రింగ్‌ రోడ్డు.. బీజింగ్‌ తరహాలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం: కేటీఆర్‌

కాగజ్ నగర్ సమీపంలోని పెద్దవాగు వద్ద ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొట్టింది. వెనకనుండి వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బిఎస్పీ అధ్యక్షుడి కారుపైకి దూసుకెళ్లింది. వెనకవైపు నుండి లారీ ఢీకొట్టడంతో కారులోనివారు ఒక్కసారిగా కుదుపుకు గురయ్యారు. అయితే కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యహరించి ఎలాంటి ప్రమాదం జరక్కుండా కారును రోడ్డుపక్కకు తీసుకెళ్లి ఆపాడు. ఈ ప్రమాదంలో ప్రవీణ్ తో పాటు కారులోని మిగతావారు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. 

ఆర్ఎస్ ప్రవీణ్ వెంటవున్న బిఎస్పి నాయకులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఆర్ఎస్ ప్రవీణ్ ప్రమాదానికి గురయినట్లు తెలిసి కంగారుపడ్డ బిఎస్పి శ్రేణులు ఆయన సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios