Asianet News TeluguAsianet News Telugu

Revanth Reddy:ఖైరతాబాద్ పేరు చెబితే గణేశుడు, పీజేఆర్ గుర్తుకు వస్తారు

ఖైరతాబాద్  నియోజకవర్గంలో  కాంగ్రెస్ అభ్యర్ధి పి. విజయా రెడ్డికి మద్దతుగా  రేవంత్ రెడ్డి  ఎన్నికల ప్రచారం ఇవాళ నిర్వహించారు.  పీజేఆర్ ఆశయాలను విజయారెడ్డి నెరవేరుస్తారని రేవంత్ రెడ్డి  చెప్పారు.

Revnath Reddy Appeals people to vote Congress lns
Author
First Published Nov 20, 2023, 9:32 PM IST


హైదరాబాద్: 20 ఏళ్ల తరువాత పీజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశాన్ని  ఖైరతాబాద్ ప్రజలకు వచ్చిందని  టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి చెప్పారు.

సోమవారంనాడు  ఖైరతాబాద్ లో జరిగిన రోడ్ షో లో కాంగ్రెస్ అభ్యర్ధి  పి.విజయారెడ్డికి మద్దతుగా  రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో పీజేఆర్ బిడ్డ విజయమ్మకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. ఆడబిడ్డను గెలిపిస్తే  మీ ఇంట్లో మీ ఆత్మగౌరవం నిలబడుతుందన్నారు. విజయమ్మను గెలిపిస్తే పీజేఆర్ పేరు నిలబెడుతుందని చెప్పారు.  ఖైరతాబాద్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరు...ఒకరు ఖైరతబాద్ గణేశుడు, ఇంకొకరు పి.జనార్దన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 పీజేఆర్ మన మధ్య లేకపోయినా పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 20 ఏళ్ల తరువాత పేజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశం ఖైరతాబాద్ ప్రజలకు వచ్చిందన్నారు.

 విజయమ్మకు ఓటు వేస్తే రేవంత్ రెడ్డికి ఓటు వేసినట్టేనన్నారు. పీజేఆర్ హయాంలోనే మీకు ఇండ్లు, కరెంటు, జరిగిన అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి  గుర్తు చేశారు. దానం నాగేందర్ ను ఎమ్మెల్యేను, మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ... అలాంటి నువ్వు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తావా? అని దానం నాగేందర్ మీద రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

 

 అన్నం పెట్టిన కాంగ్రెస్ కు సున్నం పెట్టడం న్యాయమేనా నాగేందర్ అని ప్రశ్నించారు. ఇలాంటి దానంను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. దానం నాగేందర్ సగం హైదరాబాద్ ను ఆక్రమించుకున్నాడని ఆయన ఆరోపించారు. కానీ బస్తీల్లో పేదలకు చేసిందేం లేదని విమర్శించారు. బీజేపీ చింతల రాంచంద్రా రెడ్డి మీకు కొత్త కాదు పాత చింతకాయ పచ్చడే ఆయన గుడికే కాదు మీకు కూడా పంగనామాలు పెట్టాడని ఆయన విమర్శించారు. ఈ సారి విజయమ్మకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios