పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా కనిపించింది.  భారీ ఓట్లతో తేడాతో ఆ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయ రమణ రావు విజయం సాధించారు. 

కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణ రావు భారీ మెజార్టీతో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 45 వేల ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఈ స్థానం నుంచి చివరిగా దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయనపై విజయ రమణ రావు గెలుపొందారు. 

పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. ఇప్పటికే భారీ ఓట్లతో తేడాతో ఆ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయ రమణ రావు ముందంజలో ఉన్నారు. 9వ రౌండ్ పూర్తయ్యే సరికి 22,744 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్ లో 5835 ఓట్లు దక్కించుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి కి 2518 ఓట్లు దక్కాయి. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణ రావు లీడ్ లో ఉన్నారు.