KTR Call Audio Leaked: మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ కాల్‌ లీక్‌.. ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారేనా.. ?

KTR: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరో ఐదు రోజులే సమయముంది. టైమ్ తక్కువగా ఉండడంతో అన్ని పార్టీల నేతలు ఊరూవాడ కలియ తిరుగుతున్నారు.బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్‌ (KTR) ఫోన్ కాల్ లీక్ .. సోషల్ మీడియాలో వైరల్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. 

Minister KTR Phone Call Audio Leaked over the Telangana Elections KRJ

KTR Phone Call Audio: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం సమీపిస్తోంది. మరో ఐదు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనున్నది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు  ముమ్మర ప్రచారాన్ని చేస్తున్నాయి. పలు పార్టీల జాతీయ నేతలు రంగంలో దిగారు. ఢిల్లీ నేతలు బహిరంగ సభలో ప్రసంగిస్తు.. లోకల్  లీడర్లు గల్లీలో తిరుగుతూ జనసమీకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలపై హామీల  వర్షం కురిపిస్తున్నారు.

ఎలాగైనా.. మూడోసారి అధికారంలో రావాలని బీఆర్‌ఎస్‌ తీవ్రంగా శ్రమిస్తుండగా.. ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ ను గద్దే దించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో మంత్రి కేటీఆర్‌ (KTR)  ఫోన్‌ కాల్‌ రికార్డు లీక్ అయ్యింది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇంతకీ ఆ కాల్ లో ఏం మాట్లాడారు?  ఎందుకు కాంగ్రెస్ నేతలు ఏద్దేవా చేస్తున్నారు. 

ఈ ఆడియోలో.. మరో నాలుగైదు రోజుల్లో ప్రచారం ముగిస్తుందని, ఈ క్రమంలో ఇంటింటికీ వెళ్లి ముమ్మరం చేయాలని,  సిరిసిల్లా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. ఎక్కడ కూడా అధైర్యపడవద్దనీ, పార్టీ నాయకులే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని.. మనల్ని మనమే తగ్గించుకోవద్దని సూచించారు. ప్రచారానికి ఇంకా వారం రోజులే సమయముందనీ, అందరూ ప్రతి గ్రామంలోనూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.

గాలి మాటలు, అబద్దపు ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. తాను ఎవరితోని మాట్లాడినా.. పక్క ఊళ్లో పరిస్థితి తేడాగా ఉందన్నా..జర చూస్కో అని చెబుతున్నారనీ,  మెజార్టీ తగ్గుందని మనోళ్లే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  ఇలాంటి పిచ్చిమాటలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రత్యర్థి  మహేందర్ రెడ్డి అక్కడ తిరుగుతున్నారు? ఇక్కడ తిరుగుతున్నారా.?  ఆ కులపోళ్లను కలిశారనీ, ఈ కులపోళ్లను కలిశారని, వాళ్లు మనకు ఓటు వేయరంట అంటూ పార్టీ నేతలే మాట్లాడుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రం మొత్తం సిరిసిల్ల వైపు చూస్తోందని, ఈ వారం రోజులు ఏ ఊరి వాళ్లు ఆ ఊరిలో, ఏ బూత్‌ వాళ్లు ఆ పరిధిలో పటిష్టంగా ఇంటింటా ప్రచారం చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో కాకుండా.. ఎన్నికల తరువాత వారంలో కనీసంగా రెండు రోజులు సిరిసిల్లకు వచ్చి స్థానికంగా అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాలంటూ, మీకేమైనా సమస్యలుంటే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పమనడం వినవచ్చు. మొత్తానికి ఈ ఫోన్‌ కాల్ రికార్డింగ్‌ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ ప్రతిపక్షాలకు ప్రచార ఆస్త్రంగా మారినట్టు అనిపిస్తుంది.  సొంత నియోజకవర్గంలోనే మంత్రి కేటీఆర్ ప్రచారానికి పోవాలంటే వెనకాడుతున్నారని, పార్టీ కేడర్ కు ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి వచ్చిందని, ఇది బీఆర్ఎస్ పరిస్థితి అని కామెంట్ చేస్తున్నారు.   మరోకరు సిరిసిల్లలో ఓడిపోతాననే భయం కేటీఆర్‌కు పట్టుకుంది, అందుకే నాయకులకు ఫోన్ చేసి..ప్రచారాన్ని ముమ్మరం చేస్తుందని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios