కరీంనగర్‌లో గంగుల, బండి మధ్య మాటల యుద్ధం.. ‘నిన్నెందుకు గెలిపించాలి?’

కరీంనగర్‌లో గంగుల కమలాకర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. పరస్పరం పదునైన మాటలు రువ్వుకుంటున్నారు. మంత్రిగా ఏం చేశావని గంగులను బండి నిలదీస్తుండగా.. ఎంపీగా ఏం నిధులు తెచ్చావని ఆయన బండి సంజయ్‌ను ప్రశ్నించాడు.
 

ministe gangula kamalakar and mp bandi sanjay up ante, harsh comments both for karimnagar seat in telangana elections kms

హైదరాబాద్: Karimnagarలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) మరోసారి పోటీ చేస్తుండగా.. రెండు సార్లు అసెంబ్లీ బరిలో ఓడిన బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ఇంకోసారి బరిలో నిలిచారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వీరి మధ్య మాటల యుద్దం భీకరమవుతున్నది. నిన్నెందుకు గెలిపించాలి? అంటే నిన్ను ఎందుకు గెలిపించాలి? అంటూ పదునైనా మాటలు విసురుకుంటున్నారు.

బండి సంజయ్ గుండె పోటు డ్రామాలు ఆడి ఎంపీగా గెలిచాడని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఇప్పుడు కూడా మరేదో డ్రామా కోసం రెడీ అయ్యాడని అన్నారు. గత రెండు సార్లు తన చేతిలోనే పరాజయం పాలైన బండి సంజయ్‌కు మరోసారి కూడా అదే గతి పడుతుందని పేర్కొన్నారు. మంత్రిగా తాను సాధించిన అభివృద్ధిని, ఫలాలను వివరించిన మంత్రి.. ఎంపీగా బండి సంజయ్ ఏం చేశాడో చెప్పగలడా? అని అడిగారు.

అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్నవారిని కలిసి గంగుల మాట్లాడారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ, నిధులు తానే తెచ్చానని మంత్రి గంగుల తెలిపారు. 2018లోనే స్మార్ట్ సిటీ పనులు ముగిశాయని, కానీ, 2019లో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కుమార్.. తానే స్మార్ట్ సిటీ తెచ్చానని బుకాయిస్తుంటాడని చెప్పారు. నాలుగున్నరేళ్ల కరీంనగర్ అభివృద్దిలో బండి సంజయ్ చారణా పైసులు కూడా తేలేదని పేర్కొన్నారు. అంతేకాదు, కరీంనగర్‌లో ముస్లింల ఓట్లు చీల్చాలనే ఉద్దేశ్యంతో బండి సంజయ్‌యే కాంగ్రెస్ అభ్యర్థిగా పురుమల్లను నిలబెట్టాడని తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read : బండి సంజయ్ కు గుండెపోటు... ఇలాంటి డ్రామాలే నమ్మొద్దు..: గంగుల కమలాకర్ (వీడియో)

మంత్రి గంగులపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు గంగులను మళ్లీ ఎందుకు గెలిపించాలి? అని ప్రశ్నించారు. నిన్ను ఎందుకు గెలిపించాలి? అంటూ గంగులకే సూటి ప్రశ్న వేశారు. రేషన్ మంత్రివైన గంగుల ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చాడా? బీసీ మంత్రివైన గంగుల ఎంత మందికి బీసీ బంధు ఇప్పించాడు అని ప్రశ్నించాడు. వడ్ల మంత్రివైన గంగుల తాలు, కటింగ్ పేరుతో క్వింటాలుకు 10 కిలోల చొప్పున దోచుకుంటావా? అని అడిగాడు. అవినీతి పరులు ఎవరో తేల్చుకుందామా? ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios