అభ్యర్థులకు లాస్ట్ మినిట్ ట్విస్టులు.. టికెట్లు ప్రకటించి మరీ మొండిచేయి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు పలు స్థానాల్లో టికెట్లు ఆశించి పొందినట్టే పొంది కోల్పోయారు. జాబితాలో పేర్లు ప్రకటించినా బీఫామ్ మరొకరికి కట్టబెట్టిన వైనంతో ఖంగుతిన్నారు. ఇంకొందరి పేర్లు మరుసటి జాబితాలో మారిపోయాయి.
 

last minute twists to candidates, brs, bjp, congress changed candidates in various constituencies kms

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఈ సారి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ కూడా సవాల్‌గా తీసుకుంది. అందుకే అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చలు, సంప్రదింపులు చేశారు. అంతా నిర్ణయానికి వచ్చాక పలు దఫాలుగా జాబితాలు విడుదల చేసి ఆయా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆ ప్రకటనల తర్వాత పేర్లు అందులో వస్తాయని ఆశించి భంగపడ్డవారూ శివాలెత్తారు. అసంతృప్తులు బాహాటంగా విమర్శలు చేశారు. కొందరైతే వెంటనే పార్టీలూ మారారు. ఇదంతా ఒకవైపు టికెట్ కోసం పడిగాపులు కాసి, కొండంత ఆశలు పెట్టుకున్నవారి పేర్లు జాబితాలో చూసి మురిసిపోయినవారు.. చివరి నిమిషంలో బీఫామ్‌లు అందక నిర్ఘాంతపోయిన వారూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత జాబితాలో పేర్లు కనపడగానే హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నవాళ్లూ.. లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్‌కు అదిరిపడ్డారు.

ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో ఈ పరిణామాలు చూశాం. టికెట్ కన్ఫామ్ కాకముందే ఆశావాహులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఊళ్లల్లో ప్రచారం, పలువర్గాలతో మంతనాలు, క్యాడర్‌ను సుస్థిరం చేసుకోవడం మొదలు పెట్టారు. టికెట్ రావడమే తరువాయి బరిలో దూకడమే అన్నట్టుగా సిద్ధం అయ్యారు. జాబితాలో పేర్లు చూసుకుని ఉప్పొంగిపోయారు. వారి వ్యూహాలకు మరింత పదునుపెట్టి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కానీ, ఇంతలోనే పిడుగులాంటి వార్త. బీఫామ్ మరొకరికి కేటాయిస్తూ పార్టీలు నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో హతాశయులైన వారూ.. పార్టీ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.

Also Read: అంగస్తంభనల కోసం వాటికి షాక్ థెరపీ.. 45 ఏళ్ల వయసులో ఆ మిలియనీర్ చేసే ప్రయోగాలివే

కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు, నారాయణ్ ఖేడ్ స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థులను మార్చుకుంది. పటాన్ చెరు నుంచి నీలం మధును ప్రకటించి బీఫాం మాత్రం కాటా శ్రీనివాస్‌కు అప్పగించింది. నీలం మధు వెంటనే బీఎస్పీ నుంచి బీఫామ్ అందుకుని జాగ్రత్తపడ్డారు. ఇక నారాయణ్ ఖేడ్ నుంచి సురేశ్ షెట్కర్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. కానీ, నామినేషన్ మాత్రం సంజీవరెడ్డి వేశారు. అలంపూర్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంనే ఖరారు చేసిన బీఆర్ఎస్ అనూహ్యంగా చివరి నిమిషంలో విజయుడికి బీఫామ్ ఇచ్చింది. బీజేపీ కూడా ఇదే దారిలో వెళ్లింది.

బీజేపీ కేవలం చివరి జాబితాలోనే ముగ్గురి పేర్లను మార్చింది. చాంద్రయాణ గుట్ట నుంచి యూ సత్యనారాయణ ముదిరాజ్‌ను ప్రకటించింది. ఆ తర్వాత కే మహేందర్ బరిలోకి దిగారు. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం బెల్లంపల్లి నుంచి తొలుత అమరాజుల శ్రీదేవిని ప్రకటించిన బీజేపీ ఆ తరవ్ాత కొయ్యల ఎమాజీ పేరును జాబితాలో చేర్చింది. ఇక వనపర్తిలో అశ్వత్థామను ముందుగా ప్రకటించి ఆ తర్వాత ఆ స్థానంలో కొత్తగా అనుఘ్న రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ఎంఐఎం రాజేంద్రనగర్‌లో రవి యాదవ్ స్థానంలో స్వామి యాదవ్‌ను మార్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios