Asianet News TeluguAsianet News Telugu

రన్ రాజా రన్ : రోడ్డుపై పరుగులు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కారణం ఇదే...

తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. నిన్న మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 

Komatireddy Rajagopal Reddy ran on the road in munugode - bsb
Author
First Published Nov 10, 2023, 8:35 AM IST

మునుగోడు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడులో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి అయిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఒక్కసారిగా ఉన్నట్టుండి రోడ్డు మీద పరుగులు పెట్టారు. అప్పటివరకు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా పరుగందుకున్నారు.  దీంతో ఎందుకలా పరిగెడుతున్నాడో అర్థం కాక అందరూ కొద్దిసేపు ఆశ్చర్యపోయారు.

కాసేపటికి కానీ అసలు విషయం అర్థమై ఊపిరి పీల్చుకున్నారు.  ఇంతకీ విషయం ఏంటంటే నామినేషన్  వేయడానికి  సమయం ముగిసిపోవడమే. కార్యకర్తలతో మాట్లాడుతూ సమయం చూసుకొని రాజగోపాల్ రెడ్డి.. ఒక్కసారిగా నామినేషన్ వేయడానికి ముహూర్తం సమయం మించిపోతుందని గమనించి వెంటనే పరుగందుకున్నారు. ఆయనతో పాటు బాడీగార్డ్లు.. కార్యకర్తలు పరుగులు పెట్టారు.  
ఎట్టకేలకు.. ఏమైతేనే నామినేషన్ కార్యాలయానికి చేరుకుని అనుకున్న సమయానికే.. ముహూర్తం మించిపోకుండా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పరుగులు  చర్చనీయాంశంగా మారాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios