karnataka farmers హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా: అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కన్నడ రైతులు జోక్యం చేసుకుంటున్నారు. కర్ణాటకలో  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో  ఆ రాష్ట్ర రైతులు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. 

karnataka farmers Tries to protest at indira park in Hyderabad lns

హైదరాబాద్: కర్ణాటక రైతులు  బుధవారంనాడు హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద  ఆందోళనకు దిగారు. అయితే  ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు  కర్ణాటక రైతులతో గొడవకు దిగారు. కర్ణాటక రైతులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ధర్నా కొనసాగించ వద్దని  కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రైతులు ఆరోపించారు.ఈ డిమాండ్ తో  ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేశారు.ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు  ఇందిరా పార్క్ వద్ద ఆందోళనకు దిగిన కర్ణాటక రైతులతో గొడవకు దిగారు. 
ఆందోళనను వెంటనే నిలిపివేయాలని కోరారు.

గతంలో కూడ గద్వాల, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో  కూడ కర్ణాటక రైతులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.  కొడంగల్ లో  కర్ణాటక రైతులతో కాంగ్రెస్ కార్యకర్తలు అప్పట్లోనే గొడవకు దిగారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు  వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడం లేదని  కర్ణాటక రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము పంటలు నష్టపోతున్నామని కర్ణాటక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కు ఓటేయాలని నేరుగా ప్రచారం చేసుకోవాలని కర్ణాటక రైతులకు సూచించారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణకు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని  కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

also read:tummala nageswara rao: నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ కోసం... ఎత్తులకు పై ఎత్తులు

రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని బలపర్చాలని కర్ణాటక రైతులు కోరుతున్నారు.  ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇచ్చిందని కర్ణాటక రైతులు చెబుతున్నారు. కానీ  కర్ణాటక రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. హైద్రాబాద్ లో సిద్ద రామయ్య ఉన్నారా అని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. కర్ణాటక సీఎం  సిద్ద రామయ్య ఇంటి ముందు ఆందోళనకు దిగాలని కర్ణాటక రైతులనుద్దేశించి కాంగ్రెస్ శ్రేణులు  వ్యాఖ్యానించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios