India Today - Axis My India - Telangana Exit Poll 2023 : కాంగ్రెస్‌దే అధికారం .. లేట్‌గా చెప్పినా రిజల్ట్ అదే
ఇప్పటికే అన్ని జాతీయ మీడియా సంస్థలు , ఏజెన్సీలు తమ సర్వే అంచనాలను ప్రకటించగా అన్నింటిలోనూ కాంగ్రెస్‌దే అధికారమని తేలంది. అయితే ఇండియా టుడే మాత్రం కాస్త ఆలస్యంగా ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించింది. ఈ సంస్థ సర్వేలోనూ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లలో వున్న ఓటర్లకు ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 2,290 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు అభ్యర్ధుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా వున్నారు. దాదాపు 68 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు, ఓటములను వారే శాసించనున్నారు.
ఇప్పటికే అన్ని జాతీయ మీడియా సంస్థలు , ఏజెన్సీలు తమ సర్వే అంచనాలను ప్రకటించగా అన్నింటిలోనూ కాంగ్రెస్‌దే అధికారమని తేలంది. అయితే ఇండియా టుడే మాత్రం కాస్త ఆలస్యంగా ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించింది. ఈ సంస్థ సర్వేలోనూ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది.
ఇండియా టుడే సర్వే అంచనాలు :
కాంగ్రెస్ : 63 - 73 స్థానాలు
బీఆర్ఎస్ : 34 - 44 స్థానాల
బీజేపీ : 4 - 8 స్థానాలు
ఎంఐఎం : 5 - 7 స్థానాలు
ఇతరులు : 1 స్థానం
— IndiaToday (@IndiaToday) December 1, 2023