Jagat Prakash Nadda: బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపు రేఖలు మారుస్తాం

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్ పై  జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. 

Highest Inflation Today Is In Telangana: BJP Chief JP Nadda lns

నిజామాబాద్: కేసీఆర్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా (జేపీ నడ్డా) విమర్శించారు. గురువారంనాడు  నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ  నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో జగత్ ప్రకాష్ నడ్డా  ప్రసంగించారు.తెలంగాణ ఉద్యమకారులను  కేసీఆర్ వంచించారన్నారు

వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే  తెలంగాణ రూపు రేఖలను మారుస్తామని ఆయన  హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో తన కుటుంబం మాత్రమే అభివృద్ది చెందిందని జేపీ నడ్డా చెప్పారు. కేసీఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిమయమైందని ఆయన ఆరోపించారు.

కుటుంబ పాలన నుండి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించిన విషయాన్ని జేపీ నడ్డా గుర్తు చేశారు. తెలంగాణలో కూడ కుటుంబ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం  అవినీతిమయంగా మారిపోయిందన్నారు. దళితబంధులో ప్రజా ప్రతినిధులు  30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని జేపీ నడ్డా విమర్శించారు.

ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. నరేంద్ర మోడీ హయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా  80 కోట్ల మందికి  ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారన్నారు.  దళితుడిని సీఎం చేస్తానన్న హమీతో పాటు అనేక హమీలను  కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని  ఆయన  హామీ ఇచ్చారు.


తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉందని ఆయన విమర్శించారు. కేసీఆర్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు సుఖ, సంతోషాలతో ఉన్నారని జేపీ నడ్డా పేర్కొన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios