Asianet News TeluguAsianet News Telugu

ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత.. స్ట్రాంగ్ రూమ్ సీల్ తొలగించారంటూ కాంగ్రెస్ ఆందోళన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర అభ్యర్ధులు శనివారం ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్ రూమ్ సీల్‌ను తొలగించారని కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర అభ్యర్ధులు ఆరోపించారు.

high tension at ibrahimpatnam rdo office ksp
Author
First Published Dec 2, 2023, 9:07 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర అభ్యర్ధులు శనివారం ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్ రూమ్ సీల్‌ను తొలగించారని కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర అభ్యర్ధులు ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి తీరును వ్యతిరేకిస్తూ నేతలు ఆందోళనకు దిగారు. పోలింగ్ జరిగి రెండు రోజులు గడిచిన సీల్ వేయకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 

నవంబర్ 29 నాటి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కు పంపలేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఆందోళనతో పోస్టల్ బ్యాలెట్‌లను రిటర్నింగ్ ఆఫీసర్ స్ట్రాంగ్ రూమ్‌కి పంపినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం అభ్యర్ధి మల్‌రెడ్డి రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయన్నారు. దీంతో ఏదో విధంగా అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారని మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు  తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios