Asianet News TeluguAsianet News Telugu

Hate speech: విద్వేష ప్రసంగం చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరోసారి కేసు నమోదు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. విద్వేష ప్రసంగం చేశారని సుమోటు తీసుకుంటూ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. లవ్ జిహాద్ అంటూ ముస్లింలను టార్గెట్ చేసుకుంటూ రాజాసింగ్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 

goshamahal bjp mla t rajasingh booked for hatespeech by hyderabad police kms
Author
First Published Nov 16, 2023, 8:48 PM IST

హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా ఆయన మహారాజ్‌గంజ్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో రాజా సింగ్ విద్వేష ప్రసంగం చేశారని కేసు ఫైల్ అయింది. మంగళ్‌హాట్ పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. రాజా సింగ్ పై సుమోటు యాక్షన్ తీసుకుంటూ మంగళ్‌హాట్ పోలీసులు ఆర్ పీ యాక్ట్ కింద సెక్షన్లు 125 కింద బుధవారం కేసు నమోదైంది.

రాజాసింగ్ మహారాజ్‌గంజ్‌లోని అగర్వల్ భవన్‌లో విద్వేష ప్రసంగం చేసినట్టు మంగళ్‌హాట్ పోలీసు స్టేషన్ ఎస్ఐ షేక్ అస్లాం ఫిర్యాదు చేశారు. ముస్లింలను టార్గెట్ చేసుకుంటూ బీజేపీ నేత టీ రాజాసింగ్ హిందీలో ప్రసంగించారనే క్యాప్షన్‌తో 51 సెకండ్ల వీడియో ఒకటి బయటకు వచ్చిందని ఎస్ఐ తెలిపారు.

Also Read: Chidambaram: తెలంగాణ బలిదానాలకు క్షమాపణలు చెప్పిన చిదంబరం.. హంతకుడే సంతపం చెప్పినట్టుంది: హరీశ్ రావు

ఆ వీడియోలో ఎమ్మెల్యే మాటలు ఇలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘చూడండి మన పోరాటం జిహాదీ వర్సెస్ హిందూ బిడ్డలది. ఈ పోరాటం ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్నది. గోషామహల్ అసెంబ్లీ స్థానం పేరు కేవలం తెలంగాణ, భారత్‌లోనే కాదు.. మొత్తం విశ్వానికే తెలుసు. ఈ విధాన సభలో రాజా సింగ్ అనే పేరుతో ఒక చిన్న హిందూ కరసేవకుడు ఉంటాడని, లవ్ జిహాద్ ఘటనలకు మూతి పగలగొట్టే సమాధానం చెబుతూ ఉంటాడని మొత్తం విశ్వానికి తెలుసు. ఎవరో ఒకరైతే ఉన్నారు కదా అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios