TELANGANA ELECTION 2023: క్యాబినెట్ మంత్రులకు కూడా ఓటమి తప్పదా? తెలంగాణ తీర్పు ఎలా ఉండబోతుంది?
TELANGANA ELECTION RESULTS 2023: ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత కేసీఆర్ క్యాబినెట్ లో చాలా మంది మంత్రుల ఓటమి ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ను అంచనా వేస్తే.. మంత్రుల్లో ఒకరిద్దరు గెలిస్తే మహా గొప్ప అని ఫీలవుతున్నారు. ఈ తరుణంలో ఎవరు విజేతలుగా నిలుస్తారు? ఎవరు పరాజయాన్ని అంటిపెట్టుకున్నారు?
TELANGANA ELECTION RESULTS 2023: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానున్నది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి? ఏ పార్టీ అధికార పగ్గాలను అందుకోనున్నది? తదుపరి సీఎం ఎవరు? ఒక వేళ హంగ్ వస్తే.. పరిస్థితేంటీ? ఎవరు కింగ్ అవుతారు? ఎవరూ కింగ్ మేకర్ ఎవరనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇలా ఎన్నికల ఫలితాలపై హైప్ రావడానికి కారణం లేకపోలేదు. పోలింగ్ పర్వం పూర్తైన తర్వత వెలువబడి ఎగ్జిట్ పోల్ ఫలితాలే ఈ టెన్షన్ కు కారణం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. దీంతో ఎవరు గెలుస్తారు. ఎవరు పరాజయాన్ని ముఠాకట్టుకుంటారనే చర్చ జోరుగా సాగుతుంది.
ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత కేసీఆర్ క్యాబినెట్ లో చాలా మంది మంత్రుల ఓటమి ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ను అంచనా వేస్తే.. మంత్రుల్లో ఒకరిద్దరు గెలిస్తే మహా గొప్ప అనే చాట్ జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఎవరు విజేతలుగా నిలుస్తారు? ఎవరు పరాజయాన్ని అంటిపెట్టుకున్నారు? అనే ఉత్కంఠ నెలకొంది.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. సీఎం కేసీఆర్ పరిస్థితే అంతాంత మాత్రంగా ఉందంట. ఆయన పోటీ చేసిన కామారెడ్డి, గజ్వేల్ లో గెలుపు కష్టమేనంటున్నారు. గులాబీ బాస్ పరిస్థితే అలా ఉంటే.. ఇక మంత్రుల పరిస్థితేలా ఉండాలి. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఏ మంత్రి కూడా బయటకు రావడం లేదు. అందరూ కూడా శిబిరాలన్నీ సైలెంట్ అయ్యాయి. వాస్తవానికి ఒక్కరిద్దరూ మంత్రులకు తప్ప మిగితా మంత్రులకు, ఇతర బీఆర్ఎస్ సిట్టింగ్ నేతలకు ప్రచారంలోనే చేదు అనుభవం ఎదురైంది. ప్రచారం లో ఎక్కడికి వెళ్లినా వారికి జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఓటమి ఖాయమని ముందుగానే తెలిసిపోయిందంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదల చేసిన సంస్థల్లో ఒకట్రెండు సంస్థలు తప్ప మిగితా అన్ని కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ మంత్రులు గెలిచే పరిస్థితి ఉందా? లేదా ? అన్నది ఇప్పుడు హాట్ డిబేట్ గా మారిపోయింది. కేసీఆర్ మంత్రి వర్గంలోనే చాలా మంది మంత్రులు పరాజయం పాలవుతున్నారనే టాక్ సంచలనంగా మారుతోంది. మొత్తం కేసీఆర్ క్యాబినెట్ లోనే ఇద్దరు లేదా ముగ్గురు గెలిస్తే మహా ఎక్కువ అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క హరీష్ రావుదే గెలుపు గ్యారెంటీ అని తెలుస్తోంది. మరో ఇద్దరు లేదా ముగ్గురు గెలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నా..హోరాహోరీ పోరు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేసినా.. ఒక దానిలో మాత్రం పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుందంటున్నారు. అటు తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ .. పరిస్థితి కూడా క్లిష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలింగ్ కు ముందు కేటీఆర్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ కాల్ రికార్డింగే ఈ ఊహాగాహానాలకు మరింత ఊతమిస్తున్నాయి. గెలుపు ఖాయమే అని తెలుస్తున్నా..మెజార్టీ చాలా తగ్గుతుందననే ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రుల్లో చాలా ముఠా ముల్లె సర్దుకోవాల్సిందేననే చర్చ జరుగుతుంది. ఈ జాబితాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఓటమిపాలవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చాలా మంది మంత్రులకు ప్రచారంలోనే చేదు అనుభవం ఎదురైంది. అడుగడునా నిరసనలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇలా నిరసనల సెగ తగిలిన నేపథ్యంలో వారి ఓటమి ఖాయమన్న అంచనాలకు వస్తున్నారు.
మరోవైపు.. కొన్ని నియోజకవర్గాలలో మంత్రులకు దీటైనా ప్రత్యర్థులుగా ఉన్నారు. దీంతో మినిస్టర్లు ఎలాగూ గెలిచే పరిస్థితి లేదంటున్నారు. ఉదాహరణ కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ కు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నుంచి బలమైన పోటీ ఎదురుకునే పరిస్తితి లేకపోదు. అదే సమయంలో నిర్మల్ లోనూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితి కూడా అంతంతా మాత్రమే అంటున్నారు. ఇలా పలు ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. ఇంకొన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ బలమైన నేతలు లేకపోయినా.. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత మంత్రులు ఓటమికి కారణం కానున్నట్టు టాక్.