ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. కాంగ్రెస్ ఫిర్యాదు : కేటీఆర్‌కు ఈసీ నోటీసులు.. వివరణ ఇవ్వాలని ఆదేశం, డెడ్‌లైన్ విధింపు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.  టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కమీషన్ తన నోటీసుల్లో పేర్కొంది.

election commission issued notices to minister ktr ksp

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ఫిర్యాదు ఆధారంగా ఈసీ ఈ నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కమీషన్ తన నోటీసుల్లో పేర్కొంది. రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకున్నారని సూర్జేవాలా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా వివరణ ఇవ్వాని నోటీసుల్లో కేటీఆర్‌ను కోరింది. 

కాగా.. ప్రభుత్వ భవనాల్లో ఇంటర్వ్యూలు, పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడాన్ని తప్పుబడుతూ కేటీఆర్‌పై కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అజయ్ కుమార్, పీసీసీ ఉపాధ్యక్షుడు జి . నిరంజన్, అధికార ప్రతినిధి రాంచంద్రారెడ్డిలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios