Asianet News TeluguAsianet News Telugu

డైపర్ లేకుండా బయటకు రాడు : వనమా వెంకటేశ్వరరావుపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్ధి వనమా వెంకటేశ్వరరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ . వనమా వెంకటేశ్వరరావు డైపర్ లేనిదే బయటకు రారంటూ వ్యాఖ్యానించారు . ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కుమార్తె కవిత అరెస్ట్ కాకుండా సీఎం కేసీఆర్ .. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. 

cpi narayana sensational comments on kothagudem brs candidate vanama venkateswara rao ksp
Author
First Published Nov 24, 2023, 8:29 PM IST

కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్ధి వనమా వెంకటేశ్వరరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కొత్తగూడెంలో ఆయన సీపీఐ అభ్యర్ధి కూనంనేని సాంబశివరావు తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. వనమా వెంకటేశ్వరరావు డైపర్ లేనిదే బయటకు రారంటూ వ్యాఖ్యానించారు.

వనమా కొడుకు రాఘవ విలాస జీవితం కోసం జైలుకు వెళ్లారని.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న జలగం వెంకట్రావు బీ.ఫాంను డబ్బులిచ్చి కొన్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ సీపీఐ క్యాడర్ కాంగ్రెస్‌కు మద్ధతుగా వున్నారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కుమార్తె కవిత అరెస్ట్ కాకుండా సీఎం కేసీఆర్ .. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. 

ALso Read: నిశ్చితార్థమైన అమ్మాయిని లేపుకుపోయినట్లుంది కాంగ్రెస్ వ్యవహారం... సీపీఐ నారాయణ సెటైర్లు...

ఇకపోతే.. కూనంనేని సాంబశివరావుకు మద్ధతుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో ప్రజా సంపద అంతా ప్రజలకే చెందాలని విక్రమార్క అన్నారు. ధనిక తెలంగాణ ఇప్పుడు అప్పుల తెలంగాణగా మారిందని.. ఈసారి తెలంగాణలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని.. మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని , కాంగ్రెస్‌కు మద్ధతుగా నిలిచిన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావును గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios