85 సీట్లతో తెలంగాణలో అధికారం: రేవంత్ రెడ్డి ధీమా

తెలంగాణలో  అధికారం ఏర్పాటు చేసే విషయమై  కాంగ్రెస్ ధీమాగా ఉంది. కాంగ్రెస్ నేతలను ఎవరిని కదిలించినా  80 
సీట్లను దక్కించుకొంటామని చెబుతున్నారు. 

Congress will  Get  85 assembly seats in Telangana says Revanth Reddy lns

హైదరాబాద్: తెలంగాణలో 80 నుండి 85 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఆదివారంనాడు  హైద్రాబాద్ లో జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన  మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో సంకీర్ణం అనే చర్చే లేదన్నారు. తమకు సంపూర్ణ మెజారిటీ వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.  ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడం కాంగ్రెస్ విధానమన్నారు. 

తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్ గా మారుస్తామన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తెలంగాణ ప్రజలు ప్రపంచంతో పోటీ పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన  చెప్పారు. కేసీఆర్ లా ఉన్నవాటిని కూల్చి కొత్తవాటిని కట్టే విధానాలకు కాంగ్రెస్ స్వస్తి పలుకుతుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

ఎఫ్ఆర్ బీ ఎం నిబంధనలకు అనుగుణంగానే బడ్జెట్ ను ఖర్చు చేస్తామని ఆయన హమీ ఇచ్చారు. అత్యవసరం,నిత్యవసరాలపైనే కాంగ్రెస్ దృష్టిపెడుతుందన్నారు.సీఎం ఎవరనే దానిపై పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని రేవంత్ రెడ్డి  చెప్పారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కక్షపూరిత ధోరణితో ఏనాడు వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు..

ప్రజలు అధికారం ఇచ్చేది వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కాదన్నారు.టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ అంశంలో సిట్ విచారణ నిస్పాక్షికంగా లేదని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన ఎస్ఎల్బీసీ ని పూర్తి చేస్తామని ఆయన హమీ ఇచ్చారు. నక్సలైట్ల ఎజెండాను అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీయేనని ఆయన  చెప్పారు.కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందన్నారు.కాంగ్రెస్ పాలనలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. 
కేసీఆర్ పాలనలో ఉన్నట్టుగా  నిర్బంధాలు ఉండవన్నారు. కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డు ఇచ్చి ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

భూ యాజమానికి, కౌలు రైతులకు, రైతు కూలీలకు అందరికీ ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఇందులో గందరగోళం ఏమీ లేదని... బీఆర్ఎస్ గందరగోళం సృష్టించాలని చూస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ ఆరు గ్యారంటీలు అసాధ్యమన్న కేసీఆర్ దానికి రాజముద్ర వేశారన్నారు.కాంగ్రెస్ మేనిఫెస్టోనే మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని రేవంత్ రెడ్డి చెప్పారు. 

also read:డిపాజిట్లే రాని పార్టీ బీసీని సీఎం ఎలా చేస్తుంది: బీజేపీ బీసీ నినాదంపై రేవంత్ సెటైర్లు

కాస్రా పహాణీ లాంటి మాన్యువల్ రికార్డులను యథాతథంగా భూమాత ద్వారా డిజిటలైజ్ చేస్తామన్నారు. ధరణి కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించారు. ధరణి పేరుతో జరిగిన దోపిడీపై సంపూర్ణంగా విచారణ చేపడతామన్నారు.కేసీఆర్ పాలనలో జరిగినంత దోపిడీ నిజాం కాలంలోనూ జరగలేదని ఆయన  ఆరోపించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios