Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఇవ్వకుండా మా పార్టీని చీల్చాలని చూశారు: కొల్లాపూర్ సభలో కేసీఆర్

పోలింగ్ సమయం దగ్గరపడే కొద్ది  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.  తన ఎన్నికల ప్రచారంలో  విపక్షాలపై విమర్శలు చేస్తున్నారు.

Congress was planned to split BRS: KCR lns
Author
First Published Nov 19, 2023, 4:02 PM IST | Last Updated Nov 19, 2023, 5:24 PM IST

కొల్లాపూర్: తెలంగాణ ఇవ్వకుండా  తమ పార్టీని చీల్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు.తెలంగాణ కోసం పుట్టిన పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అని ఆయన గుర్తు చేశారు.  తెలంగాణ ఇవ్వకుండా  భారత రాష్ట్ర సమితిని కాంగ్రెస్  చీల్చే ప్రయత్నం చేసిందని  కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ  ఎందుకు పుట్టి ఉండేదని ఆయన ప్రశ్నించారు.తాను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ సాధించడం తనకు జీవితాంతం గుర్తుండే ఉంటుందన్నారు.తెలంగాణకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా ఆయన  పేర్కొన్నారు. 

50 ఏళ్లు  కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలన్నారు. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. బలవంతంగా  తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపి ఇబ్బంది పెట్టారని కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైరయ్యారు.ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులు తప్ప ఇంకేమీ లేదన్నారు.మహబూబ్ నగగర్ జిల్లాలో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిపారని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ తెచ్చేది ఇందిరమ్మ రాజ్యమా తోకమట్టనా అని ఆయన  సెటైర్లు వేశారు. ఇందిరమ్మ రాజ్యంలో  తెలంగాణ వెనుకబడిన ప్రాంతమన్నారు.   పక్కనే కృష్ణా నది ఉన్న కనీసం తాగు నీళ్లు కూడ ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ పాలకులదని ఆయన  విమర్శించారు. ఇవాళ ఇవాళ నీళ్లు ఎలా వచ్చాయని ఆయన  ప్రశ్నించారు.  

also read:ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులే: ఆలంపూర్ సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

ఇందిరమ్మ రాజ్యంలో సస్యశ్యామలంగా ఉంటే ఎన్టీఆర్  ప్రభుత్వం  రెండు రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన  ప్రశ్నించారు.  ఇందిరమ్మ రాజ్యంలో  ఆకలి బతుకులు,  కాల్పులు, నక్సలైట్లు, ఎన్ కౌంటర్లే కదా అని ఆయన ప్రశ్నించారు.ఈ రాజ్యం కావాలా అని ఆయన అడిగారు.

తెలంగాణ ఇస్తామని  బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని  ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదని కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైరయ్యారు. అంతేకాదు తమ పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలను కూడ చీల్చే ప్రయత్నం చేశారని  ఆయన విమర్శించారు.  తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడోనని  తాను దీక్ష చేస్తేనే  కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని కేసీఆర్  చెప్పారు

 

.రైతు బంధు ఇచ్చి  ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని కేసీఆర్ గుర్తు చేశారు.  రైతు బంధు వృధా అని ఆయన  ప్రశ్నించారు. రైతులకు  మూడు గంటల విద్యుత్ కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు.అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కింద నీటి పన్నుందన్నారు. కానీ, తమ ప్రభుత్వ పాలనలో  నీటిపన్ను కూడ ఎత్తివేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.రైతు బంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ అన్నారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios