Asianet News TeluguAsianet News Telugu

Telangana Election Results : కాంగ్రెస్‌దే అధికారం

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.  ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావొచ్చని అనిపిస్తోంది.

Congress leading in Telangana elections 2023
Author
First Published Dec 3, 2023, 8:21 AM IST

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు అందిన ఓట్ల లెక్కింపు వివరాల ప్రకారం.  కాంగ్రెస్ ముందంజలో ఉంది. అధికారానికి అవసరమైన 60 స్థానాలకు మించి  కాంగ్రెస్ పార్టీ  లీడ్ సాధించింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం కాంగ్రస్ పార్టీ 65 సీట్లలో లీడ్ లో ఉంది. అధికార బీఆర్ ఎస్ కేవలం 40 సీట్ల లీడ్ కే పరిమితమైంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్

మరోవైపు కాంగ్రెస్ నేతలు అధికార ఏర్పాటుకు సంబందించిన ప్రయత్నాలు కూాడా ప్రారంభించింది.

ఈ ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారనేది మరో గంట గంటన్నరలో తేలిపోనుంది. తెలంగాణలో నవంబరు 30న 119 స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ అధికారంలోకి రావాలంటే 60 అసెంబ్లీ సీట్లు గెలవాలి.

మరోవైపు ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా కాంగ్రెస్ గెలుస్తుందన్న ఆశతో శ్రేణులు భారీ ఎత్తున సంబరాలకు సిద్ధమై ఉన్నాయి. మరోవైపు నిన్న రాత్రి భారీ ఎత్తున సంబరాలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ బీఆర్ ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటి వరకు  అందిన ఫలితాల సరళిని గమనిస్తే.. కాంగ్రెస్, అధికార బీఆర్ ఎస్ ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నట్లు అర్థమవుతోంది. మరికొన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తియితే కానీ.. అధికారానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ ఎవరికి దక్కనుందనేది తెలియదు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios