సూర్యాపేటలో హైడ్రామా, టెన్షన్: నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ రెబెల్ పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేటలో కాంగ్రెస్ కు రెబెల్ బెడద తప్పింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగడంతో చివరకు పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.
సూర్యాపేట: సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి రెబెల్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన పటేల్ రమేష్ రెడ్డి బుధవారం నాడు తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. సూర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టును ఇవ్వనున్నట్టుగా పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది.గతంలో కూడ ఇదే రకంగా ఇచ్చిన హామీని నెరవేర్చని విషయాన్ని కూడ పటేల్ రమేష్ రెడ్డి గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు పటేల్ రమేష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఫోన్ లో కూడ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడ పటేల్ రమేష్ రెడ్డితో మాట్లాడారు.
ఇవాళ ఉదయం పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కాంగ్రెస్ నేత రోహిత్ చౌదరి పటేల్ రమేష్ రెడ్డితో చర్చలు జరిపారు. నాలుగు గంటల హైడ్రామా తర్వాత పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.