సారాంశం

హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  తొలి రౌండ్ లో  ముందంజలో ఉన్నారు.తొలి రౌండ్ లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి 2380 ఓట్ల మెజారిటీ ఆధిక్యంలో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్  30న  పోలింగ్ జరిగింది.  రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని భారత రాష్ట్ర సమితి అస్త్రశస్త్రాలను సంధించింది.  కాంగ్రెస్ పార్టీ ఈ దఫా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని  పార్టీ నాయకత్వం  ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో తెలంగాణలో  పట్టు సాధించాలని  బీజేపీ నాయకత్వం  అన్ని అస్త్రాలను ప్రయోగించింది.  ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీలు కలిసి పోటీ చేశాయి.  బీజేపీ  111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది.