నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో  ఉద్రిక్తత కొనసాగుతుంది.  బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య  శనివారంనాడు ఘర్షణ చోటు చేసుకుంది.  బీఆర్ఎస్ డబ్బులు తరలిస్తుందనే  ప్రచారం నేపథ్యంలో  ఈ రెండు పార్టీల మధ్య  ఘర్షణ జరిగింది.ఈ విషయంలో సీఐ బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారని  కాంగ్రెస్ ఆరోపిస్తుంది.

అచ్చంపేట:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అచ్చంపేట సీఐపై కాంగ్రెస్ నేతలు ఆదివారంనాడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. 

 అచ్చంపేట సీఐ బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. శనివారంనాడు రాత్రి అచ్చంపేటలో జరిగిన ఘటనను ఈ సందర్భంగా వికాస్ రాజ్ దృష్టికి వెళ్లారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిన్న అచ్చంపేటలో చోటు చేసుకున్న పరిస్థితులపై వీడియోను కూడ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతలు అందించారు. 

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శనివారంనాడు బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘర్షణలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

also read:ప్రజలను మెప్పించి గెలవాలి: గువ్వల బాలరాజును పరామర్శించిన కేటీఆర్

బీఆర్ఎస్ శ్రేణులు ఓ కారులో నగదును తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. డబ్బులు తరలిస్తున్నారనే అనుమానంతో ఉప్పునుంతల మండలంలో కారును కాంగ్రెస్ శ్రేణులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే కారును ఆపకుండా వెళ్లిపోయారు. దీంతో కారు అచ్చంపేటకు చేరుకోగానే కాంగ్రెస్ శ్రేణులు ఆ కారును అడ్డుకున్నారు. కారుపై దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకొని బీఆర్ఎస్ శ్రేణులు కూడ అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి.