ఆటో డ్రైవర్లపై కేసీఆర్ హామీల వర్షం..  

k. chandrashekar rao:  గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆటో డ్రైవర్లపై హామీల వర్షం కురిపించారు.  

CM KCR Good News For Auto Drivers KRJ

CM KCR: పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తంగా మారుతోంది. ఎలాగైనా సరే ఈసారి జరిగే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని బిఆర్ఎస్ పార్టీ  తీవ్రంగా శ్రమిస్తుంది.  అదే సమయంలో సీఎం కేసీఆర్ ను గద్దెదించి అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ తరుణంలో ముమ్మర ప్రచారం చేస్తూ.. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజాకర్షణ పథకాలకు ఓటు వేస్తారా? లేదా మద్యం,డబ్బుకు ప్రభావితం అవుతారా? లేదా నిజాయితీగల వ్యక్తులకు ఓటు వేస్తారో? అలాగే.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో  డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు తీపి కబురు చెప్పారు. తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు మేలు చేకూరేలా..సుమారు వంద కోట్లు ఖర్చు చేసి మాఫీ చేస్తామని, ఇలా చేయడం వల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందుతారని కేసీఆర్ అన్నారు. ఇవాళ మానకొండూరు నియోజకవర్గంలో  జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ తరుణంలో ఆటో డ్రైవర్లపై తనవైపు తిప్పుకునేలా వరాల జల్లు కురిపించారు. ఆటో డ్రైవర్లకు వచ్చే ఆదాయం చాలా తక్కువ అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

తమ పార్టీ మరోసారి అదికారంలోకి వస్తే..  పన్ను రద్దు చేస్తామని  హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఫిట్‌నెస్ ఫీజు రూ.750, పర్మిట్ ఫీజు రూ. 500 మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా డీజీల్ ధరలు పెంచారని విమర్శించారు. కేసీఆర్ నిర్ణయంపై ఆటో డ్రైవర్లు,యూనియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు దేశంలో హోంగార్డులకు అత్యధిక జీతాలు ఇస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో మొత్తం దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios