బీఆర్ఎస్ కనుమరుగు ఖాయం:సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
ఆరు గ్యారంటీ స్కీమ్ లపై కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలో కాంగ్రెస్ హమీల గురించి ప్రచారం చేస్తున్నారు.
ఖమ్మం: ఈ నెల 30వ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు.
మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారంనాడు భట్టి విక్రమార్క విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)పై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. తాను ఇక్కడే ఉంటానని తనకు ఓటేయాలని బీఆర్ఎస్ అభ్యర్ధి కమల్ రాజ్ ప్రచారాన్ని మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ఈ నెల 30వ తేదీ తర్వాత బీఆర్ఎస్ పార్టీయే ఉండదు... అలాంటప్పుడు బీఆర్ఎస్ అభ్యర్ధి ఇక్కడ ఉంటే ఏమౌతుందని ఆయన ప్రశ్నించారు.
పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అభివృద్ది చేయలేదని చెప్పారు. రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు కాంగ్రెస్ హయంలో ఇచ్చినవేన్నారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ లో కొత్త కార్డులు ఒక్కటి కూడ ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
ఈ నెల 30న ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టబోతున్నారని మల్లుభట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సంపదను పంచుతామన్నారు.
also read:డిపాజిట్లే రాని పార్టీ బీసీని సీఎం ఎలా చేస్తుంది: బీజేపీ బీసీ నినాదంపై రేవంత్ సెటైర్లు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని ఆయన విమర్శలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇస్తున్నారు. ఆరు హామీలకు సంబంధించి భట్టి విక్రమార్క గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరు హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీల గురించి ఆయన ప్రజలకు హామీలు ఇస్తున్నారు.