Karimnagar: బండి సంజయ్ మూడోసారి ఓటమి నుంచి తప్పించుకుంటాడా?

బండి సంజయ్ మూడోసారైనా అసెంబ్లీ బరిలో నెగ్గేనా? బలమైన హిందూత్వ ఐకాన్‌గా పేరు సంపాదించుకున్న బండి సంజయ్‌కు యూత్‌లో మంచి ఆదరణ ఉన్నది. సంజయ్‌ను రెండు సార్లు ఓడించిన గంగుల కమలాకర్‌ పాపులర్ లీడర్. 
 

can bjp candidate bandi sanjay win against gangula kamalakar from karimnagar kms

హైదరాబాద్: కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి బండి సంజయ్ రెండు సార్లు ఓడిపోయారు. ఇప్పుడు మూడోసారి ముచ్చటగా అసెంబ్లీ బరిలోకి ఈ స్థానం నుంచి దిగుతున్నారు. గతంలోనూ రెండు సార్లు బండి సంజయ్ ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ పైనే ఓడిపోయారు. 2018, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్‌ను కమలాకర్ ఓడించారు. ఇప్పుడు మూడోసారి ఈ ఓటమి నుంచి బండి సంజయ్ కుమార్ తప్పించుకుంటారా?

బలమైన హిందూత్వ ఆలోచనలు కలిగిన నేతగా బండి సంజయ్‌కు గుర్తింపు ఉన్నది. అదే గంగుల కమలాకర్ నియోజకవర్గంలో పాపులర్ లీడర్. కాంగ్రెస్ నుంచి బొమ్మకల్ గ్రామ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు. ఈయన అసెంబ్లీ బరిలో తొలిసారి అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ముగ్గురూ ఒకే కమ్యూనిటీకి చెందినవారు. ముగ్గురూ బీసీకి చెందిన మున్నూరుకాపు సామాజిక వర్గస్తులే.

2019 లోక్ సభ స్థానానికి ఎన్నికైన బండి సంజయ్ హిందుత్వ అప్పీల్ కలిగి ఉన్నారు. కరీంనగర్‌లో యూత్‌లో ఆదరణ ఉన్నది. అదే కమలాకర్ గ్రామీణ ప్రాంతాల నుంచీ ఓట్లను ఆకర్షించగలరు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇందుకు దోహదపడతాయి.

Also Read: Minor Girls: మైనర్ బాలిక అండాలను అమ్ముతున్న గ్యాంగ్.. యూపీలో నలుగురి అరెస్టు

బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా 2020 నుంచి 2023 వరకు కొనసాగినప్పుడు పార్టీ రాష్ట్రంలో పుంజుకుంది. అప్పుడు జరిగిన ఉపఎన్నికలు సహా జీహెచ్ఎంసీలోనూ సత్ఫలితాలను రాబట్టగలిగింది. అర్ధాంతరంగా అధ్యక్ష పదవి నుంచి పక్కనబెట్టడంపై ఆయన అభిమానుల్లో ఆవేదన ఉన్నది. బీజేపీ శ్రేణులన్నీ ఆయన కోసం కలిసి పని చేయడానికి ఇదొక ఫ్యాక్టర్‌గా పని చేయవచ్చు. ఇప్పుడు ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గురించి బండి సంజయ్ మాట్లాడుతున్నారు.

కమలాకర్ మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ మళ్లీ ఎన్నికైతా అనే ధీమాతో ఉన్నారు.

2014 ఎన్నికల్లో బండి సంజయ్ 27.8 శాతం ఓటు షేర్(52,455 ఓట్లు) పొందగా.. కమలాకర్ 40.22 శాతం ఓటు షేర్ (77,029 ఓట్లు)తో గెలుపొందారు. అదే 2018లో సంజయ్ పై 14,974 ఓట్లతో కమలాకర్ గెలుపొందారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios