telangana election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఓటు హక్కు వున్న ఏపీ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసింది . ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటే తెలంగాణలో ఓటు వున్నట్లు ఓటరు కార్డు చూపితే వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఓటు హక్కు వున్న ఏపీ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం చేసిన విజ్ఞప్తికి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఏపీకి చెందిన పలువురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా గురువారం జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటే తెలంగాణలో ఓటు వున్నట్లు ఓటరు కార్డు చూపితే వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను ఎన్నికల సంఘం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కంపెనీలు మాత్రం సెలవు ఇవ్వని విషయం ఈసీ దృష్టికి వచ్చింది. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు.
Also Read: telangana election 2023 : రేపు సెలవు ఇవ్వని సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు : తెలంగాణ సీఈవో వికాస్ రాజ్
గతంలో జరిగిన ఎన్నికల్లో అంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly polls 2018), 2019 లోక్ సభ ఎన్నికల (lok sabha polls 2019) సమయంలో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు అన్ని కంపెనీలు సెలవు ప్రకటించిందో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. ఓటింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా.. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు సెలువులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (telangana government) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తెలంగాణ ఉద్యోగులు, కార్మికులందరికీ నవంబర్ 30వ తేదీని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఈ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3వ తేదీన జరగనుంది. అదే రోజున ఫలితాలు వెల్లడికానున్నాయి.