సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారంనాడు కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇడుపులపాయలో  కడప సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదం నుండి బయటపడ్డారు.

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కాన్వాయ్ లోని వాహనశ్రేణికి శుక్రవారం నాడు ప్రమాదం జరిగింది. సీఎం కాన్వాయ్ లోని  వాహనాన్ని వెనుక నుండి మరో వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో  వాహనం స్వల్పంగా దెబ్బతింది.ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

అన్నమయ్య, కడప జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  రెండు రోజుల పాటు  పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడ కడప జిల్లాలోని పలు కార్యక్రమాల్లో  సీఎం జగన్ పాల్గొన్నారు.  ఇడుపులపాయలో  సీఎం జగన్ పాల్గొన్నారు.అనంతరం ఆయన తన కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో  ప్రమాదం చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ లోని  వాహనశ్రేణిలో రెండు వాహనాలు ఢీకొన్నాయి.  ముందున్న వాహనాన్ని వెనుక నుండి వచ్చిన వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న వాహనం స్వల్పంగా దెబ్బతింది.

ఈ కాన్వాయ్ లో ఉన్న వాహానాల్లో ప్రయాణీస్తున్న ఎవరికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు.దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్  వాహన శ్రేణిలో ప్రమాదం జరిగిందని తెలిసి అంతా కంగారు పడ్డారు. అయితే జగన్ ప్రయాణీస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుసుకుని అంతా ఊపిరిపీల్చుకున్నారు.