Asianet News TeluguAsianet News Telugu

Anasuya Bharadwaj : ఎన్నికల ఫలితాలపై బాధతో కేటీఆర్ ట్వీట్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన అనసూయ భరద్వాజ్.!

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలుబడ్డ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీనిపై అనసూయ ఆసక్తికరంగా స్పందిస్తూ రిప్లై ఇచ్చింది. 
 

Anasuya Bharadwaj to KTRs tweet on Telangana Election Results 2023 NSK
Author
First Published Dec 3, 2023, 6:05 PM IST

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)  తెలంగాణ ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. తెలంగాణ ప్రజలు చేతిలో చేయివేసిన సందర్భంగా.. ప్రభుత్వాన్ని కోల్పోయిన తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భావోద్వేగమైన ట్వీట్ చేశారు. రెండు సార్లు అవకాశమిచ్చారు. తెలంగాణ ప్రజలకు కృతజతలు. ఎన్నికల ఫలితాల్లో మేం ఆశించిన ఫలితాలు లేకపోవడం కచ్చితంగా నిరాశ చెందామని ట్వీట్ లో వెల్లడించారు. 

ఈ క్రమంలో కేటీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ట్ పార్టీకీ శుభాకాంక్షలు తెలిపారు. దాంతో కేటీఆర్ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. బీఆర్ ఎస్ నెగ్గకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు కూడా ఆ ట్వీట్ కు సానుకూలంగా రిప్లై ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని నటిగా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అనసూయ భరద్వాజ్ కూడా స్పందించింది. కేటీఆర్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ ఆసక్తికరమైన నోట్ రాసుకొచ్చింది. 

అనసూయ రిప్లై లో కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఇలా రాసుకొచ్చింది.... సార్, మీరు నిజమైన నాయకులు. ఎందరికో స్ఫూర్తినిచ్చారు. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి కూడా చూడాల్సిన అవసరం మీకు  ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధికి ధన్యవాదాలు. అన్నిట్లో హైదరాబాద్‌ను పరోగతి సాధించేలా చేసినందుకు నగరంతో ప్రేమలో పడ్డాను!’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.కేటీఆర్ పనితీరును అభినందిస్తూ.. ఎప్పటికీ  ఆయన లీడర్ షిప్ ఉండాలంటూ ఇలా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ రిప్లై నెట్టింట వైరల్ గా మారింది.

తెలంగాణలో 2023 ఎన్నికల ఫలితాలు సంచనంగా మారాయి. రాష్ట్రంలో 65 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి విజయ కేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్39 స్థానాలకే పరిమితం అయ్యింది. ఎంఐఎం 7, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందాయి. కొద్దిసేపటి కిందనే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామ చేస్తూ గవర్నర్ కు లేఖ పంపారు. రేపు టీపీసీసీ నుంచి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక అనసూయ ప్రస్తుతం ‘పుష్ప2 : ది రూల్’ చిత్రంలో నటిస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios