రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండగా గెలవబోతున్నాడని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. అటు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి 17 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బ్రహ్మాండంగా గెలుస్తుందన్నారు.
వికారాబాద్: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండగా గెలవబోతున్నాడని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు.
అటు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి 17 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బ్రహ్మాండంగా గెలుస్తుందన్నారు.
రెండు రాష్ట్రాల్లో 36 మంది ఎంపీలు గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు నాయుడు పరిస్థితి బాగోలేదని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని స్పష్టం చేశారు. వికారాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ ఏపీలో చంద్రబాబు కహాని కతమైపోయిందన్నారు. ఓడిపోతాడని తెలిసే హైదరాబాద్ పై శాపనార్థాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
రెండు రోజులుగా తనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇస్తాడని నీ చెవిలో చెప్పాడా అంటూ జగన్ ను చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని ఇది దుర్మార్గమన్నారు.
టీఆర్ఎస్ పార్టీ గానీ, తెలంగాణ గానీ తమ మేలు తాము కోరుకుంటామని అలాగే ఇతరుల మేలు కూడా బ్రహ్మాండంగా కోరుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. లక్షలాది మంది సాక్షిగా తెలంగాణ గడ్డపై నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నా విను అంటూ కేసీఆర్ కీలక హామీలిచ్చారు.
ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందన్నారు. ఇప్పటికే రాజ్యసభలో, పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం చర్చించామని గుర్తు చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడటం లేదని సహకరిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడలేదన్నారు.
గ్రామాలను ముంచొద్దని మాత్రమే కోరామని తెలిపారు. తమకు న్యాయపరంగా రావాల్సిన 1000 టీఎంసీల తెలంగాణకు ఇవ్వాల్సిందేనన్నారు. సముద్రంపాలయ్యేదాని కంటే మీరు వాడుకుంటే తప్పేంలేదన్నారు. చంద్రబాబులా చీకటి పనులు చెయ్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.
పొద్దుగాలే లేచి మంది గోతులు చంద్రబాబులా తాము తియ్యమన్నారు. నీలాంటి కుట్రలు తెలంగాణకు రావన్నారు. తాము బాగుండాలి ఇతరులు కూడా బతకాలని తాము కోరుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.
చంద్రబాబులాంటి సన్నాసిని తాను కాదని కేసీఆర్ తెలిపారు. అలాగని అల్పులం కాదన్నారు. తెలివి తేటలు ఉన్నాయన్నారు. ఉదార స్వాభావం ఉందన్నారు. అంతేకానీ నీలా రాజకీయాల కోసం అబద్దాలు ఆడేవాళ్లం కాదని స్వార్థ పరులం అంతేకంటే కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
నీలా సన్నాసిని కాదు, కుట్రలు నాకు చేతకాదు: చంద్రబాబుపై కేసీఆర్
