Asianet News TeluguAsianet News Telugu

పెద్దపల్లిలో టీఆర్ఎస్‌ను ఓడించండి: వివేక్ పిలుపు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించాలని మాజీ ఎంపీ గడ్డం వివేక్ తన అనుచరులను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో  ఓ ఆడియో సందేశాన్ని కూడ పంపారు.

vivek decides to work against trs in peddapalli parliament segment
Author
Peddapalli, First Published Apr 8, 2019, 10:36 AM IST


పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించాలని మాజీ ఎంపీ గడ్డం వివేక్ తన అనుచరులను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో  ఓ ఆడియో సందేశాన్ని కూడ పంపారు.

పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ టిక్కెట్టును  వివేక్ ఆశించారు.కానీ, వివేక్‌ను కాదని  కాంగ్రెస్ పార్టీ నుండి  టీఆర్ఎస్‌లో చేరిన నేతకాని వెంకటేష్‌కు టీఆర్ఎస్ ఈ స్థానాన్ని కేటాయించింది.
 
దీంతో వివేక్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి, టీఆర్ఎస్‌కు ఇటీవలనే రాజీనామా చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై వివేక్‌తో ఆయన అనుచరులు రెండు రోజులుగా హైద్రాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రెండు రోజులుగా అనుచరులతో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతివ్వాలని వివేక్ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో వివేక్ అనుచరులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎఐసీసీ ముఖ్య నేతలు కూడ వివేక్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. రాష్ట్ర నాయకత్వం కూడ వివేక్‌ను ఈ ఎన్నికల్లో  తమ పార్టీకి మద్దతివ్వాలని కోరినట్టు సమాచారం. ఈ మేరకు వివేక్ సానుకూలంగా నిర్ణయం తీసుకొన్నారనే ప్రచారం సాగుతోంది.టీఆర్ఎస్‌‌ అభ్యర్థిని ఓడించాలని కోరుతూ ఈ మేరకు ఓ సందేశాన్ని కూడ వివేక్ సోషల్ మీడియాలో తన అనుచరులకు పంపినట్టుగా తెలుస్తోంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios