తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తాను బాధ్యతను ఓటేశానని మరి మీరు వేశారా అంటూ ప్రజలను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఓటు హక్కును భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని...మన ఓటు ద్వారా మంచి నాయకులను ఎన్నుకోవాలంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 

కేటీఆర్ బంజారాహిల్స్‌‌లోని నందినగర్‌‌ జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కేటీఆర్ ఓటేశారు. భార్య శైలిమతో కలిసి ఉదయమే పోలింగ్ బూత్ కు చేరుకున్న ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ సందర్భంగా దిగిన పోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మీరు కూడా ఓటేసి మీ బాధ్యతను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అంతా తానై వ్యవహరించిన కేటీఆర్ ఈ ఎన్నికల ద్వారా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలి సవాల్‌ ను ఎదుర్కొంటున్నారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ప్రజలతో మమేకమై ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆయన పనితనం లోక్ సభ ఫలితాల్లో భయటపడనుంది. అంతేకాకుండా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కేటీఆర్ ఓటు వేసిన తొలి ఎన్నికలు ఇవే కావడం మరో విశేషం. 

Scroll to load tweet…