Asianet News TeluguAsianet News Telugu

కొడంగల్‌లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతుందా?: కేటీఆర్

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి నియోజకవర్గ లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో ఓటమిపాలైన వ్యక్తి ఇప్పుడు మల్కాజిగిరిలో ఫోటీ చేస్తున్నట్లు గుర్తుచేశారు. ఇలా కొడంగల్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరి లో చెల్లుతుందా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. అక్కడ సరిగ్గా పనిచేయకుంటేనే ప్రజలు తిరస్కరించారని...అలాంటి వ్యక్తి ఇక్కడి ప్రజలు ఆదరిస్తారని అనుకోవడమే విడ్డూరంగా వుందన్నారు.  
 
trs working president ktr election campaign at malkajgiri
Author
Hyderabad, First Published Apr 3, 2019, 8:58 PM IST

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి నియోజకవర్గ లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో ఓటమిపాలైన వ్యక్తి ఇప్పుడు మల్కాజిగిరిలో ఫోటీ చేస్తున్నట్లు గుర్తుచేశారు. ఇలా కొడంగల్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరి లో చెల్లుతుందా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. అక్కడ సరిగ్గా పనిచేయకుంటేనే ప్రజలు తిరస్కరించారని...అలాంటి వ్యక్తి ఇక్కడి ప్రజలు ఆదరిస్తారని అనుకోవడమే విడ్డూరంగా వుందన్నారు.  

కాబట్టి నియోజక వర్గ సమస్యలు తెలిసిన స్థానిక నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మల్కాజిగిరి ఓటర్లకు సూచించారు. మొదటి నుండీ మీ అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఇతడు మల్కాజిగిరి అభివృద్ధి కోసం కృషిచేస్తాడన్న నమ్మకం ఉందన్నారు. కాబట్టి స్థానికేతరులను కాకుండా స్థానికుడైన టీఆర్ఎస్ నాయకున్ని గెలిపించాలని కేటీఆర్ కోరారు. 

హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి, చేవెళ్ల, సింకింద్రాబాద్ లలో టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకునే బాధ్యతను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నియోజకర్గాల పరిధిలో ఆయన రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం బుధవారం మల్కాజిగిరి లో సాగింది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రితో పాటు మంత్రి మల్లారెడ్డి తో కలిసి కేటీఆర్ ఈ రోడ్ షో లో పాల్గొన్నారు.  

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వుండే కంటోన్మెంట్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తోందని... కానీ అందుకు బిజెపి ప్రభుత్వం  సహకరించడం లేదన్నారు. ముగ్గురు బీజేపీ కేంద్ర మంత్రులను కలిసి కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. జీహెచ్ఎంసి పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కంటోన్మెంటు పరిధిలో జరుగడంలేదన్నారు. కావాలంటూ ఓసారి రెండు ప్రాంతాల అభివృద్ధిని ఒక్క సారి పోల్చుకోవాలన్నారు.  

లక్షల మంది ప్రజలు కంటోన్మెంట్ పరిధిలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని...వీటిని పరిష్కరించడానికి రెండు స్కై వేల నిర్మాణానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.  పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హై వె మాదిరిగా రెండు స్కై వేల నిర్మాణానికి రూపకల్పన చేసి నిధులు కూడా కేటాయించుకున్నప్పటికీ కేంద్రం అభ్యంతరాల కారణంగా అభివృద్ధి పనులు ముందుకు వెళ్లడం లేదన్నారు. రక్షణ శాఖ 100 ఎకరాలు ఇస్తే, మేము 600 ఎకరాలు ఇస్తామని మాట ఇచ్చిప్పటికీ బీజేపీ ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను పెడచెవిన పెడుతోందని కేటీఆర్ ఆరోపించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios