తిరుపతి:  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు 14 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటుందని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు.

ఆదివారం నాడు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలను విడుదల చేశారు.ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ఫలితాలను లగడపాటి రాజగోపాల్ వివరించారు. 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి  సున్నా నుండి రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఎంఐఎం కు ఒక్క సీటు దక్కుతోందన్నారు. టీఆర్ఎస్ కు 14 నుండి 16 సీట్లు కూడ దక్కే  అవకాశం ఉందని ఆయన ప్రకటించారు.