దేశ రాజకీయాలను శాసించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేంధర్ రెడ్డికి ఈసారి లోక్ సభ ఎన్నికలకు దూరం పెట్టారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ గా కొనసాగుతున్న నల్గొండ లోక్ సభ నియోజవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వేంరెడ్డి నర్సింహా రెడ్డి పోటీ చేయనున్నట్లు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.  

కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్ సభ అభ్యర్థులకు పార్టీ తరపున భీఫామ్ లు అందజేసినట్లు తెలుస్తోంది. అయితే గుత్తా సమక్షంలోనే నల్గొండ అభ్యర్థిగా నర్సింహారెడ్డిని ప్రకటించిన బీఫామ్ కూడా అందించినట్లు తెలుస్తోంది. దీంతో గుత్తా సుఖేంధర్ వెంటనే ప్రగతి భవన్ నుండి భయటకు వెళ్లిపోయినట్లు  సమాచారం. 

అలాగే మహబూబ్ నగర్ నుండి కూడా సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి కాకుండా మన్నె శ్రీనివాస్ రెడ్డి ని లోక్ సభ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆయనకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా బీఫామ్ అందించినట్లు విశ్వసనీయ సమాచారం. 

ఇలా మిగతా అభ్యర్థుల పేర్లను కూడా ముఖ్యమంత్రి ఖాయం చేశారు. వారందరికి ఇప్పటికే సమాచారం అందించగా ప్రగతిభవన్ కు చేరుకున్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆరే బీఫామ్స్ అందిస్తున్నారు.