హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. 16 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై చాలా కసరత్తు చేశారని తెలుస్తోంది. 

అభ్యర్థుల ఎంపిక పూర్తైన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జాబితా విడుదల చేయనున్నారు. దీంతో ఎవరు బరిలో ఉంటారు ఎవర ఫెడ్ అవుట్ అవుతారోనని ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే గతంలో గెలిచిన ఎంపీలలో ముగ్గురుకి టికెట్ ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

అలాగే 16 మంది పార్లమెంట్ అభ్యర్థుల్లో సగానికిపైగా కొత్తవారికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే వీరిలో 8మంది సిట్టింగ్ అభ్యర్థులకు మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. 

అలాగే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ లకు ఈసారి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. 

టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ అభ్యర్థుల వివరాలు
1. సికింద్రాబాద్-తలసాని సాయికిరణ్ యాదవ్ 
2. మల్కాజ్ గిరి- మర్రి రాజశేఖర్ రెడ్డి
3.  నల్గొండ-గుత్తా సుఖేందర్ రెడ్డి 
4. చేవెళ్ల-డా.రంజిత్ రెడ్డి 
5.  భువనగిరి- బూర నర్సయ్యగౌడ్
6.  నిజామాబాద్-కల్వకుంట్ల కవిత
7. జహీరాబాద్-బీబీ పాటిల్ 
8. వరంగల్ -పసునూరి దయాకర్ రెడ్డి
9.  కరీంనగర్- వినోద్ కుమార్ 
10. పెద్దపల్లి-జి.వివేక్ 
11. నాగర్ కర్నూల్-పి.రాములు
12. మెదక్-కొత్త ప్రభాకర్ రెడ్డి 
13. మహబూబ్ నగర్-ఎంఎస్ఎన్ రెడ్డి
14. మహబూబాబాద్-
15. ఆదిలాబాద్-నగేష్
16. ఖమ్మం-నామా నాగేశ్వరరావు