బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై నిజామాబాద్ ఎంపీ కవిత స్పందించారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పసుపు బోర్డు ఏర్పాటు అంశం మేనిఫెస్టోలో పెడతామన్న  బీజేపీ ఆ అంశాన్ని ఎక్కడా పేర్కొనలేదని ఎద్దేవా చేశారు.

దీంతో బీజేపీ భారతీయ ఝూట్ పార్టీ అని మరోసారి నిరూపించుకుందని ఆమె దుయ్యబట్టారు. కుల వృత్తులకు భారీగా నిధులు కేటాయించి ఆదుకున్నామని, ఎర్రజోన్న రైతులకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు.

మైనార్టీ యవతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామని కవిత స్పష్టం చేశారు. మే 1 నుంచి ఆసరా పెన్షన్లు రూ.2016 ఇస్తామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్నామని తెలిపారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వాళ్లకి రూ.5 లక్షలు ఇస్తామని కవిత హామీ ఇచ్చారు.