Asianet News TeluguAsianet News Telugu

పోలింగ్ బూతులో టీఆర్ఎస్ మాజీ మంత్రి దౌర్జన్యం...సిబ్బందిపై ఫైర్

గురువారం తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని సామాన్య ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు. అయితే ఓ టీఆర్ఎస్ మాజీ మంత్రి మాత్రం పోలింగ్ బూతులోనే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి ఎన్నికల నిబంధనలకు అతిక్రమించి ఓటేశారు. 
 
trs ex minister chandulal angry on polling employees
Author
Mulugu, First Published Apr 12, 2019, 3:50 PM IST

గురువారం తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని సామాన్య ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు. అయితే ఓ టీఆర్ఎస్ మాజీ మంత్రి మాత్రం పోలింగ్ బూతులోనే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి ఎన్నికల నిబంధనలకు అతిక్రమించి ఓటేశారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ ఓటేయడానికి తన స్వగ్రామానికి వెళ్లారు. ఇలా అతడు ములుగు మండలం జగ్గన్న పేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుకు చేరునున్నారు. అయితే పోలింగ్ బూతులోని వెళ్ళిన ఆయన్ని పోలింగ్ సిబ్బంది నిబంధలను ప్రకారం ఓటర్ ఐడీ చూపించమని అడిగారు. దీంతో సదరు సిబ్బందిపై మంత్రి తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు.  

తానెవరో మీకు తెలియదా అంటూ వారిని కోపంగా ప్రశ్నించారు. తాను ఏ ఐడీ కార్డు చూపించను... కావాలంటే ఓటర్ లిస్టులో పేరుందో లేదో చూసుకోవాలంటూ సిబ్బంది అసహనం ప్రదర్శించారు. వారు నిబంధనల గురించి చెప్పినా వినిపించుకోలేదు. దీంతో చేసేదేమిలేక కేవలం ఓటర్ లిస్ట్ లో పేరును చూసి మాత్రమే మంత్రికి ఓటేసేందుకు అనుమతిచ్చారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios