తెలంగాణ లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఒక్క నిజామాబాద్ లో మినహాయిస్తే మిగతా అన్ని చోట్లా 5గంటలకే ఎన్నికలు ముగిశాయి. అప్పటివరకు జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే భువనగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదవగా అత్యల్పంగా సికింద్రాబాద్ లో 39.20 శాతం నమోదయ్యింది. నిజామాబాద్ 5 గంటల వరకు 54.20 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 

నియోజకవర్గాల వారిగా పోలింగ్ శాతాలు

హైదరాబాద్ 39.49 శాతం

సికింద్రాబాద్ 39.20 శాతం

 మల్కాజ్‌గిరి 42.75 శాతం

 మహబూబ్‌నగర్ 65 శాతం 

మెదక్ 68 శాతం

జహీరాబాద్ 67.80 శాతం

నల్లగొండ 66.11 శాతం 

నాగర్ కర్నూల్ 57.2 శాతం

భువనగిరి 68.25 శాతం

చేవెళ్ల 53.08, కరీంనగర్ 68 శాతం

 ఖమ్మం 67.92 శాతం

ఆదిలాబాద్ 66.76 శాతం 
 
పెద్దపల్లి 59.24 శాతం 

వరంగల్ 59.17 శాతం

మహబూబాబాద్ 59.90 శాతం  
 
నిజామాబాద్ 54.20 శాతం ( 5 గంటల వరకు)

అయితే తమకు పూర్తి వివరాలు అందిన తర్వాత ఈ  గణాంకాలలో మార్పులు చేర్పులు వుంటాయని ఈసీ తెలియజేసింది. ఈ వివరాలు ప్రాథమికంగా అంచనా వేసినవని తెలంగాణ ఎన్నికల సంఘం వెల్లడించింది.