హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో  మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ సీట్లు వస్తాయని ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుచుకొనే ఛాన్స్ ఉందని ప్రకటించింది. పరిస్థితి తారుమారైతే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కకపోవచ్చని కూడ ఈ సంస్థలు ప్రకటించాయి.

ఎంఐఎం తన స్థానాన్ని నిలుపుకొనే ఛాన్స్ ఉందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. బీజేపీకి ఒక్క సీటు వస్తే రావచ్చని కూడ ఆ సంస్థలు ప్రకటించాయి.అయితే ఆయా సంస్థలు ప్రకటించిన సర్వే ఫలితాలు ఏ మేరకు నిజమౌతాయో ఈ నెల 23వ తేదీన తేలనున్నాయి.


లగడపాటి 

టీఆర్ఎస్ 14 (2 సీట్లు పెరిగే ఛాన్స్)
కాంగ్రెస్ 0-2 
ఎంఐఎం -1

న్యూస్ -18

టీఆర్ఎస్ 12-14
కాంగ్రెస్ 1-2 
ఎంఐఎం 1
బీజేపీ 1-2

టుడేస్ చాణక్య

టీఆర్ఎస్ 14 (2 సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)
కాంగ్రెస్ 0-2 
ఇతరులు- 1 (1 సీటు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)

ఇండియా టుడే

టిఆర్ఎస్  10-12

బిజెపి  1-3

కాంగ్రెస్ 1-3

ఇతరులు 0-1