ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సర్వేలు చెప్పాయి.. కానీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయించి కేసీఆర్ గెలిచారని ఆమె ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు విజన్ ఉందని, ఆయన ఓ ప్రణాళికతో పనిచేస్తారని విజయశాంతి స్పష్టం చేశారు. దేశంలో జీఎస్టీ వల్ల ఎవరికి లాభం ఉందని ప్రశ్నించారు. దేశాన్ని దోచుకుంటున్న మోడీ పెద్ద దొంగని, రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ చిన్న దొంగని ఆమె వ్యాఖ్యానించారు.